AP Government Jobs 2023 : ఏపీలో 590 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్యశాఖలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలో 41 స్పెషాలిటీ, సపర్‌ స్పెషాలిటీల్లో 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు జూలై 14వ తేదీ (శుక్రవారం) నోటిఫికేషన్‌ జారీచేసింది.
AP Government Jobs Notification 2023

డైరెక్ట్, లేటరల్‌ ఎంట్రీ విధానాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. జూలై 17వ తేదీ నుంచి  వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ అందుబాటులోకి రానుంది. జూలై 26 దరఖాస్తుకు వర‌కు గడువు. 

☛ Bank Exam Preparation Tips: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్‌ పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అయితే ఒక ఉద్యోగం మీకే

ద‌ర‌ఖాస్తు ఫీజు ఇలా.. : 
ఓసీ అభ్యర్థులు రూ.1000.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లూఎస్, వికలాంగ అభ్యర్థులు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రూ. 1000. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగ అభ్యర్థులు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 

చదవండి: APPSC Group 2 Exam: గ్రూప్-2 సిలబస్ సైన్స్ విద్యార్థికి ప్రయోజనకరంగా ఉండబోతుందా?

ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా చర్యలు..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్యకళాశాలలను ప్రారంభించాలని ప్రభు­త్వం నిర్ణయించింది. దీంతోపాటు కొత్తగా ఏర్పా­టు­చేసిన కడప మానసిక ఆస్పత్రి, పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, పలు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రు­ల్లో వైద్య పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయి. ఈ పోస్టుల భర్తీలో భాగంగా తాజా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా చర్యలు చేపట్టిన సీఎం జగన్‌ ప్రభుత్వం 50 వేలకుపైగా పోస్టులను భర్తీచేసింది.

చదవండి: APPSC Group 2లో గిరిజనుల ప‌ద‌జాలం.. ఒక్క మార్కు గ్యారెంటీ..

#Tags