Jobs at 108 Service: ఉద్యోగావకాశం.. ఈఎంటీ పోస్టుకు దరఖాస్తులు
Sakshi Education
అర్హులు, ఆసక్తి గలవారు 108లో ఉద్యోగావకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం గురించి జిల్లా మేనేజర్ ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు ప్రకటించిన తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు కింది వివరాల్లో తెలుసుకోండి.
సాక్షి ఎడ్యుకేషన్: 108లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఎస్.సుబ్బారావు సోమవారం తెలిపారు. 108 సర్వీస్‌లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియనన్(ఈఎంటీ)గా పనిచేసేందుకు ఆసక్తి గలవారు పూర్తి బయోడేటా, విద్యకు సంబంధించిన సర్టిఫికెట్స్‌తో ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Teachers Promotions: ఉపాధ్యాయుల పదోన్నతుల సమావేశం
బీఎస్సీ బయాలజీ, బీజెడ్‌సీ, బీఎస్సీ నర్సింగ్, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బి.ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 108 ఆఫీస్, పాత ప్రభుత్వ ఆస్పత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో సంప్రదించాలని కోరారు.
Published date : 04 Oct 2023 09:10AM