Mega job fair on tomorrow: రేపు మెగా జాబ్ మేళా
వికాస, దూబచర్ల వన్ టీమ్ ఆధ్వర్యాన నల్లజర్ల మండలం దూబచర్ల ఎలైట్ జూనియర్, డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 9 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్‌భరత్ తెలిపారు.
మేళా వాల్ పోస్టర్‌ను కలెక్టరేట్‌లో గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ మేళాలో సుమారు 25 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో సుమారు 1,500 ఉద్యోగాల నియామకానికి ఈ మేళా నిర్వహిస్తున్నారని వివరించారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో మేళాకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ ఎస్‌వై బాబు, వికాస మేనేజర్ గోళ్ళ రమేష్ పాల్గొన్నారు.
Tags
- Mega jobs fair
- Job mela
- Jobs
- latest jobs
- Latest Jobs News
- Mega job fair on tomorrow
- jobs news in telugu
- DSC Telugu
- AP Jobs News
- ap jobs news 2023
- Job Notification
- Latest Job Notification
- Mini Job Mela
- Job Mela in Andhra Pradesh
- Job Mela in AP
- Job Mela for freshers candidates
- Telangana News
- AP News
- Google News
- Breaking news
- india news
- trending india news