AP Government Jobs 2023 : గుడ్‌న్యూస్‌.. 6,840 కొత్త పోస్టుల భ‌ర్తీకి మంజూరుకు ఆమోదం.. అలాగే గ్రూప్‌-1, 2 పోస్టులకు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కూడా గుడ్‌న్యూస్ చెప్పారు.
AP CM YS Jagan Mohan Reddy

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో జూన్ 7వ తేదీన‌ మంత్రివర్గ సమావేశం జ‌రిగింది . ఈ స‌మావేశంలో మొత్తం 63 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల(2014, జూన్‌ 2 నుంచి పని చేస్తున్నవాళ్లు) క్రమబద్దీకరణకు ఆమోదంతో పాటు సంక్షేమ పథకాలైన అమ్మ ఒడి పథకం, జగనన్న ఆణిముత్యాలు పథకంతో పాటు ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, అలాగే పీఆర్‌సీ ఏర్పాటునకు, కొత్త డీఏ అమలునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది

6,840 కొత్త పోస్టుల‌కు..
6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో పోలీస్‌ బెటాలియన్‌ ఖాళీలు 3,920 పోస్టులు ఉన్నాయి. అలాగే కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. గ్రూప్‌-1, 2 పోస్టుల నియమకాలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

చదవండి: ఏపీపీఎస్సీ Group 1&2 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ |ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ 

➤ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

మ‌రి కొన్ని పోస్టుల వివ‌రాలు ఇవే..

☛ 476 గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీల్లో నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులకు ఆమోదం.
☛ బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో రెగ్యులర్‌ ఉద్యోగులకు ఆమోదం. 
☛ కో-ఆపరేటివ్‌ సొసైటీల్లో సూపర్‌ న్యూమరీ పోస్టుకు ఆమోదం. 
☛ కడప మానసిక వైద్య కళాశాలలో 116 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం. 
☛ సీతానగరం పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌కు 23 పోస్టులకు ఆమోదం. 
☛ పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌.. డయాలసిస్‌ యూనిట్‌కు 41 మెడికల్‌ ఆఫీసర్లకు ఆమోదం తెలిపింది. 
☛ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ ఈఈ పోస్టును ఈఈగా అప్‌గ్రేడ్‌ చేశారు. 

☛ APPSC Chairman Gowtham Sawang : త్వరలోనే 1,962 పోస్టుల‌కు నోటిఫికేషన్లు.. ఈ సారి గ్రూప్‌-1 & 2 పోస్టుల‌ను..

ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ సారి..

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధానం తీసుకొస్తోంది. ఏపీ గ్యారెంటెడ్‌ పెన్షన్‌ స్కీం అమలుకు ఆమోదం తెలిపింది. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ గ్యారెంటీ పెన్షన్ స్కీం బిల్లు ముసాయిదాను ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించింది. ఉద్యోగుల భద్రత కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లును రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు కేబినెట్‌లో నిర్ణయించారు. 

☛ APPSC Group-2 New Syllabus Details 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కొత్త సిల‌బ‌స్ ఇదే..

☛ పాత ఫించను పథకానికి సమానండే ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత వచ్చే 50 శాతం ఫించనకు తగ్గకుండా, డీఏ క్రమంగా పెరిగేలా కొత్త విధంగా కొత్త బిల్లును రూపొందించారు. గ్యారెంటెడ్ పెన్షన్ బిల్ 2023 పేరుతో బిల్లు ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది.

☛ APPSC Group 2 Best Books List : ఈ సిల‌బ‌స్ చ‌దివితే ఉద్యోగం ఈజీనే.. |ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు ఇవే..

☛ కొత్త పీఆర్‌సీ(12వ) ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. 2022, జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులందరికీ ఏరియర్స్‌తో 2.73 శాతం డీఏ వర్తింపజేయనుంది. జిల్లా కేంద్రాల్లో పని చేసేవాళ్లకు 12 నుంచి 16 శాతానికి హెచ్‌ఆర్‌ఏను పెంచింది.

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

☛ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
☛ రైల్వే జాబ్స్
☛ మెడికల్ జాబ్స్
☛ బ్యాంక్ జాబ్స్
☛ ఇంజనీరింగ్ జాబ్స్
☛ ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
☛ డిఫెన్స్‌ జాబ్స్

#Tags