APPSC Chairman Gowtham Sawang : త్వరలోనే 1,962 పోస్టులకు నోటిఫికేషన్లు.. ఈ సారి గ్రూప్-1 & 2 పోస్టులను..
త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ రానుందని వెల్లడించారు. ఏపీపీఎస్సీ 2019–23 మధ్య 57 నోటిఫికేషన్ల ద్వారా 5,705 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టి.. ఇప్పటిదాకా 4,594 పోస్టులను భర్తీ చేసిందన్నారు. మిగిలిన పోస్టుల భర్తీ వివిధ స్థాయిల్లో ఉన్నట్టు వివరించారు.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ |టీఎస్‌పీఎస్సీ
మరో 9 నోటిఫికేషన్ల ఫలితాలను..
గతంలో ఇచ్చిన ఆరు నోటిఫికేషన్లపై కోర్టు కేసులు ఉన్నందున భర్తీ ఆలస్యమవుతోందని తెలిపారు. మరో ఏడు నోటిఫికేషన్ల పోస్టులకు పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే మరో 9 నోటిఫికేషన్ల ఫలితాలు వెల్లడించాల్సి ఉందన్నారు. సరైన కారణం లేకుండా కొందరు పరీక్షలపై కోర్టులను ఆశ్రయిస్తున్నారని.. దీంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోందని చెప్పారు. ఈసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అందువల్లే ఈసారి గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చిన మూడు నెలల్లోనే ప్రిలిమ్స్ నిర్వహించి 19 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని తెలిపారు.
☛ APPSC Group 2 Sociology : Group-2 సోషియాలజీ నుంచి ప్రశ్నలు ఇలా కూడా ఉంటాయా..!
☛ APPSC Group-2 New Syllabus Details 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్-2 కొత్త సిలబస్ ఇదే..
☛ APPSC Group 2 Best Books List : ఈ సిలబస్ చదివితే ఉద్యోగం ఈజీనే.. |ముఖ్యమైన ప్రశ్నలు ఇవే..