Junior Civil Judge Topper Success Story : ఇక్కడ మిస్సయినా.. అక్కడ టాపర్‌గా నిలిచానిలా... కానీ..
సొంత రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఓ జ్ఞానసరస్వతి తిరిగి అదే రాష్ట్రంలో విద్యా కుసుమమై విరబూసింది. అత్యధిక మార్కులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ జడ్జి విభాగంలో టాపర్‌గా నిలిచిన ఆ తెలంగాణ తేజం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లికి చెందిన శాలినిరెడ్డి. ఈ నేపథ్యంలో యర్రం శాలినిరెడ్డి సక్సెస్ జర్నీ మీకోసం...
కుటుంబ నేపథ్యం :
శాలినిరెడ్డి.. బాల్యం క్యాతనపల్లిలోనే మొదలైంది. వారి తల్లిదండ్రుల సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు. తల్లిదండ్రులు యర్రం కరుణాకర్‌రెడ్డి భాగ్యరేఖ. గతంలోనే వారి కుటుంబం ఇక్కడకు వచ్చి స్థిరపడింది.
➤☛ Sirisha, SI : నన్ను ఆఫ్‌ట్రాల్ కానిస్టేబుల్ అన్న ఆ ఎస్పీతోనే..
ఎడ్యుకేషన్ :
శాలినిరెడ్డి.. 2013లో పదో తరగతిలో 9.7 గ్రేడ్ పాయింట్లు సాధించింది. అలాగే ఇంటర్మీడియట్‌లో 2015లో 974 మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. అనంతరం ఆర్‌బీవీవీఆర్ మహిళా కళాశాలలో బీఎస్సీ పూర్తిచేశారు. పడాల రామిరెడ్డి కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం అభ్యసించారు.
అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు.. కానీ
ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేసిన శాలినిరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే అప్పుడే జ్యుడీషియల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు రాసినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు. అయినా తన పంథం వీడలేదు.
➤☛ DSP Yegireddi Prasad Rao : ఆయన కష్టాలను కళ్లారా చూశాడు..డీఎస్పీ అయ్యాడు..
ఏపీలో జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ రాగానే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జ్యుడీషియల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నారు. గత సెప్టెంబర్‌లో జరిగిన ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 6న నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అంతేకాదు ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో శాలిని ఏపీ టాపర్‌గా నిలిచి జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికైంది. దశాబ్దాల క్రితం వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన శాలిని కుటుంబమే కాదు ఇరు రాష్ట్రాల ప్రజల అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. ఇక్కడ చేజారినా.. పట్టుదలతో అక్కడ తన కలను సాకారం చేసుంది. త్వరలోనే శాలినిరెడ్డి జూనియర్ సివిల్ జడ్జిగా పదవిని అలంకరించబోతుంది. అలాగే పట్టుదల ఉంటే... ఎంతటి విజయం అయిన సాధించవచ్చని నిరూపించారు శాలినిరెడ్డి.
➤☛ Nagalakshmi: కూలి పనులు చేస్తూ..చదివా..నా జీవితాన్ని మార్చింది ఇదే..