Good News: దరఖాస్తుల గడువు పొడిగింపు

పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్ నియామకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును నవంబర్‌ 24 వరకు పొడిగించినట్టు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ డా.అమరేంద్రకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
‘వెటర్నరీ’ దరఖాస్తుల గడువు పొడిగింపు

అర్హతగల అభ్యర్థుల వద్ద నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించేందుకు తొలుత అక్టోబర్‌ 10 వరకు గడువును నిర్దేశించామన్నారు. పరిపాలన కారణాల దృష్ట్యా ఈæ గడువును నవంబర్ 24వ తేదీ వరకు పొడిగించామన్నారు. అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తులను విజయవాడలోని పశుసంవర్ధక శాఖ సంచాలకుల వారి కార్యాలయంలో స్వయంగా సమర్పించేందుకు అవకాశం కల్పించామన్నారు.

చదవండి: 

Medical: వైద్య సీట్లపై గెజిట్‌ నోటిఫికేషన్

Teachers: టీచర్ల పదోన్నతులకు బ్రేక్‌

#Tags