Skip to main content

TSPSC: ఉద్యోగ నియామకాలకు పరీక్షలు.. పరీక్ష తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి అర్హత పరీక్షల నిర్వహణ తేదీలను తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది.
TSPSC
ఉద్యోగ నియామకాలకు పరీక్షలు.. పరీక్ష తేదీలు ఇవే..

నోటిఫికేషన్‌లో ప్రకటించిన తేదీలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహించనున్నట్టు కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు మార్చి 3న ఒక ప్రకటన విడుదల చేసింది. పశుసంవర్థక శాఖ పరిధిలో 185 వీఏఎస్‌(వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌), ఉద్యాన వన శాఖ పరిధిలో 22 హెచ్‌ఓ పోస్టులు, రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు మార్చి, ఏప్రిల్‌లో పరీక్షలు జరగనున్నాయి. వీఏఎస్‌ ఉద్యోగాలకు రెండ్రోజుల పాటు పరీక్షలు నిర్వహించనుండగా.. హెచ్‌ఓ, ఏఎంవీఐ పోస్టులకు ఒక రోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయి. మరిన్ని వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను చూడాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌  పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

పోస్టు

ఖాళీలు

పరీక్ష తేదీ

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(క్లాస్‌ ఏ అండ్‌ బీ) (పశు సంవర్థక శాఖ)

185

15–03–23 (ఉదయం, మధ్యాహ్నం)
16–03–23(ఉదయం)

హార్టికల్చర్‌ ఆఫీసర్‌ (ఉద్యానవన శాఖ)

22

04–04–23(ఉదయం, మధ్యాహ్నం)

అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (రవాణా శాఖ)

113

23–04–23(ఉదయం, మధ్యాహ్నం)

Published date : 04 Mar 2023 01:51PM

Photo Stories