Singareni Seva Samiti: నిరుద్యోగ యువతకు సింగరేణి ప్రోత్సాహం

రెబ్బెన(ఆసిఫాబాద్‌): నిరుద్యోగ యువతకు సింగరేణి యాజమాన్యం ప్రోత్సాహం అందిస్తుందని బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ రవిప్రసాద్‌ అ న్నారు.
నిరుద్యోగ యువతకు సింగరేణి ప్రోత్సాహం

 సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అందించిన ఉచిత పోలీస్‌ శిక్షణ, గోలేటిలోని గ్రంథా లయం ద్వారా అందించిన సేవలతో పోలీసు కాని స్టేబుల్‌ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అక్టోబ‌ర్ 5న‌ తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చదవండి: SCCL: జూనియర్‌ అసిస్టెంట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన

సింగరే ణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధే కాకుండా సమీప గ్రామాల్లో నిరుద్యోగ యువత ప్రభుత్వ కొలువులు సాధించేందుకు అన్నివిధాలుగా ప్రోత్సాహం అంది స్తామని పేర్కొన్నారు. తొమ్మిది మంది యువకులు, ఇద్దరు యువతులు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. గ్రంథాలయంలోపాటు మైదానంలో అన్నిరకాల వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏజీఎం తిరుమల్‌రావు, డీవైపీఎం రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్‌ పర్సనల్‌ అధికారి శ్రీనివాస్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: SCCL: ఏటేటా.. ఉద్యోగులకు టాటా!

#Tags