46 Medical jobs Notification: వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ప్రొగ్రాం అసిస్టెంట్, డేటా అనలిస్ట్, సిస్టం అడ్మినిస్ట్రేటర్‌... ఇలా 7 విభాగాల్లో 46 పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ మార్చి 15న‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నోటిఫికేషన్‌ను http://­apmsrb.­ap.gov.in/msrb/లో అందుబాటులో ఉంచామని ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ మెంబర్‌ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 16న‌ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 25వ తేదీ వరకు గడువు ఉంటుందని చెప్పారు.

చదవండి: Jobs: మెడికల్‌ కళాశాలలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రొఫె­సర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు వేరుగా మార్చి 15న‌ నోటిఫికేషన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ జారీ చేసింది.

http://­apm­srb.­ap.gov.in/msrb/లో పూర్తి నోటి­ఫి­కేషన్‌ అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు సంబంధిత వైద్య కళాశాలల్లో మార్చి 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా  దర­ఖాస్తులను అందజేయాల్సి ఉంటుందన్నారు.

చదవండి: Provisional Selection List: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల ప్రొవిజనల్‌ జాబితా విడుదల

#Tags