TREI-RB: సాంకేతిక సమస్య.. ‘గురుకుల’ దరఖాస్తుకు పలువురు దూరం

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ), లైబ్రేరియన్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు మే 17తో ముగిసింది.
సాంకేతిక సమస్య.. ‘గురుకుల’ దరఖాస్తుకు పలువురు దూరం

ఏప్రిల్‌ 17 నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించిన గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ).. అభ్యర్థులకు నెలపాటు అవకాశం కల్పించింది. అయితే, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై అభ్యర్థుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గురుకుల పోస్టుల దరఖాస్తుల సమర్పణకు ఓటీఆర్‌ తప్పనిసరి చేశారు. అయితే, ఓటీఆర్‌ నమోదు పేజీని తెరిచి ఆధార్‌ వివరాలు నమోదుచేసి క్లిక్‌చేసిన వెంటనే పేజీ ఎర్రర్‌ అని వస్తోందని, ఒకవేళ పేజీ తెరుచుకున్నా.. వివరాల నమోదు సమయంలో ఎర్రర్‌ వస్తున్నట్లు తెలిపారు.

చదవండి: TS Gurukulam Teacher Jobs: టీఎస్‌ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..

సమస్యపై గురుకుల బోర్డుకు ఫిర్యాదులు చేసినా, దరఖాస్తు తేదీని పొడిగించాలని కోరినా అధికారుల నుంచి స్పందన లేదని అభ్యర్థులు వాపోతున్నారు. సాంకేతిక సమస్యతో అనేకమంది దరఖాస్తు చేసుకోలేకపోయారని వారంటున్నారు. కాగా, 17వ తేదీ సాయంత్రం 5 వరకు గడువును నిర్దేశించినప్పటికీ రాత్రి 11.59 వరకు కూడా ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించినట్లు బోర్డు అధికారులు చెప్పారు.  

చదవండి: TREIRB: గిరిజన కొలువుల్లో.. మహిళకు పట్టం!

#Tags