KGBV Jobs: కేజీబీవీలో ఖాళీల భర్తీ..మ‌రి కొన్ని పోస్టులు ఇలా భర్తీ చేశారు..

నిర్మల్‌ రూరల్‌: జిల్లాలోని కేజీబీవీలో ఖాళీల భర్తీకి డీఈవో కార్యాలయంలో అక్టోబర్ 22న కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 31 ఖాళీలలో 16 పోస్టులు భర్తీ చేశారు.

9 మంది పీజీఆర్టీలు, ఆరుగురు సీఆర్టీలు, యూఆర్‌ఎస్‌లో ఒక సీఆర్టీ మొత్తం 16 ఖాళీలు భర్తీ అయ్యాయి. వీరికి డీఈవో రవీందర్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. వీరంతా అక్టోబర్ 22న తమకు కేటాయించిన కేజీబీవీలలో జాయిన్‌ అయ్యారు.

చదవండి: KGBV Jobs: కేజీబీవీలో ఖాళీలు..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

గతేడాది కేజీబీవీలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం రాత పరీక్ష నిర్వహించారు. మెరిట్‌వచ్చిన వారికి పోస్టింగ్‌ ఇచ్చారు. అయితే కొందరికి వివిధ రంగాలలో ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన పోస్టులను అదే రాత పరీక్ష ఆధారంగా భర్తీ చేశారు.
 

#Tags