Appointment of Doctors: వైద్యుల నియామకానికి ఇంటర్వ్యూ

ఉట్నూర్‌ రూరల్‌: ఉట్నూర్‌ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నాలుగు ప్రత్యేక వైద్యుల పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమించడం కోసం ఆగ‌స్టు 23న కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్‌ ఉపేందర్‌ ఆగ‌స్టు 16న‌ ఓ ప్రకటనలో తెలిపారు.

గత నెల 29న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పేరుకే జిల్లా ఆసుపత్రి’ కథనానికి స్పందించిన కలెక్టర్‌ వైద్య పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. ఖాళీగా ఉన్న జనరల్‌ ఫిజీషియన్‌, ఆర్థోపెడిక్‌ సర్జన్‌, ఎనిస్తీషియా, ఫల్మనాలజీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

చదవండి: TUTF: హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

అర్హులు దరఖాస్తులను ఆదిలాబాద్‌లోని సూపరింటెండెంట్‌ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9849878635, 9490024909 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

#Tags