TUTF: హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
Sakshi Education
ఆసిఫాబాద్: అధికార దుర్వినియోగానికి పా ల్పడుతూ ఉపాధ్యాయులను వేధిస్తున్న ఆసిఫాబాద్ మండలంలోని బూర్గుడ స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) నాయకులు కోరారు.
ఈ మేరకు జిల్లా కేంద్రంలో డీఈవో అశోక్‌కు ఆగస్టు 15న ఫిర్యాదు చేశారు. ఆ సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి పెండ్యాల సదాశివ్ మాట్లాడు తూ బూర్గుడ హెచ్‌ఎం కక్షపూరితంగా ఉపాధ్యాయులను వేధిస్తున్నారని ఆరోపించారు. సరెండర్ లీవ్, లోన్ల మంజూరులో కాలయాపన చేస్తున్నారన్నారు.
చదవండి: PRTUTS: అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని వినతి
బూర్గుడలో ఎస్‌ఏగా విధులు నిర్వర్తిస్తూ విరమణ పొందిన సత్యనారాయణ మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఫిబ్రవరి నుంచి నేటి వరకు సంబంధిత శాఖకు ఫార్వర్డ్ చేయలేదని పేర్కొన్నారు. సదరు ప్రధానోపాధ్యాయుడిపై విచారణ జరి పి ఈ నెల 19లోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 19 నుంచి ధర్నా చేపడతామన్నారు. నాయకులు వెంకట్రావు, శంకర్, కృష్ణమూర్తి, మహేశ్, ఉపాధ్యాయులు ఉన్నారు.
Published date : 16 Aug 2024 01:11PM