Professor Yadagiri: పోటీ పరీక్షల పుస్తకాల వివరాలివ్వండి

తెయూ(డిచ్‌పల్లి) : విద్యార్థులు సిద్ధమవుతున్న పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాల వివరాలను ఇవ్వాలని తెయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం యాదగిరి వర్సిటీ లైబ్రేరియన్‌ సత్యనారాయణను ఆదేశించారు.
పోటీ పరీక్షల పుస్తకాల వివరాలివ్వండి

 ఆగ‌స్టు 16న‌ క్యాంపస్‌లోని సెంట్రల్‌ ల్రైబరీని రిజిస్ట్రార్‌ సందర్శించారు. లైబ్రరీలో అందుబాటులో ఉన్న పోటీ పరీక్షల పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా కావాల్సిన కొత్త పుస్తకాల కొనుగోలుకు సంబంధించి ఇండెంట్‌ను వెంటనే తయారు చేయాలన్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

వీలైనంత త్వరగా పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని లైబ్రేరియన్‌ను ఆదేశించారు. ఇన్‌చార్జి వీసీ వాకాటి కరుణ క్యాంపస్‌లోని సెంట్రల్‌ లైబ్రరీ వసతులు, అవసరమైన పుస్తకాల గురించి చర్చించారన్నారు. రిజిస్ట్రార్‌ వెంట చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వివేక్‌రాజ్‌, విద్యార్థి నాయకులు తదితరులున్నారు.

#Tags