KGBV Jobs: కేజీబీవీలో ఖాళీల భర్తీకి చర్యలు.. రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా భర్తీ..
నిర్మల్ చైన్‌గేట్: జిల్లాలోని కస్తూరిబాగాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ, సీఆర్టీ, పీఈటీ, యూఆర్‌ఎస్‌లలోని ఖాళీలను 2023 రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతించిందని డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపా రు.
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు మరియు 1:3 వెరిఫికేషన్ జాబితా https://deonml.weebly.com లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అర్హులైన 1:3 అభ్యర్థులకు ఫోన్‌కు సమాచారం ఇస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 24న ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు జతల జిరాక్స్ కాపీలు తీసుకుని ఐడీవోసీ కార్యాలయం రూం నంబర్ 17లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని వివరించారు.
కేజీబీవీలలో వివిధ కేటగిరీలలో 30 ఖాళీలకు 16 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. 14 పోస్టులకు అభ్యర్థులు లేనందున క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. యూఆర్‌ఎస్‌లో 1 పోస్టు ఖాళీ ఉండగా, పోస్టు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags