Singareni: సింగరేణిలో రాణిస్తున్న మహిళా ఉద్యోగులు
శ్రీరాంపూర్: ఎంతో కష్టతరమైన సింగరేణి గనుల్లో కూడా మహిళలు తమ సత్తా చాటుతున్నారు. నింగి, నేల ఏదైనా సరే తమకు అవకాశం కల్పిస్తే పురుషులతో సమానంగా రాణిస్తామని నిరూపించుకుంటన్నారు.
సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు మొదలైన తరువాత మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చాలా మంది కార్మికులు తమ కొడుకుల స్థానంలో కూతుర్లకు డిపెండెంట్ ఉద్యోగం కల్పిస్తున్నారు.
చదవండి: Singareni Jobs: సింగరేణి ఉద్యోగులకు గోల్డెన్ చాన్స్
శ్రీరాంపూర్ డివిజన్‌లోనే సుమారు 215 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. జీఎం కార్యాలయాల్లో, పలు డిపార్టుమెంట్లు, స్టోర్స్, వర్క్‌షాప్‌లలో, భూగర్భ గనులు, ఓసీపీల్లో విధులు నిర్వహిస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కథనం.
#Tags