872 Jobs: కొత్త మెడికల్‌ కాలేజీలకు ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎనిమిది మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ జనరల్‌ ఆస్పత్రుల్లో 872 ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతిచ్చింది.

ఈ మేరకు జూలై 16న‌ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలో భర్తీ చేయబోయే ఈ పోస్టులను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటారు.

జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, నర్సంపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌ మెడికల్‌ కాలేజీల్లోని పోస్టులను భర్తీ చేస్తారు. ఒక్కో కాలేజీలో ప్రొఫెసర్‌ పోస్టులు 25, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 28, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 56 చొప్పున మొత్తం 109 పోస్టులు భర్తీ చేస్తారు.

చదవండి: TGSRTC Fake Notification: అది ఫేక్‌ నోటిఫికేషన్‌: సజ్జనార్‌

ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల వేతనం రూ.లక్షన్నర, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల వేతనం రూ.1.25 లక్షలు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతులు రావాలంటే తక్షణమే పోస్టుల భర్తీ అవసరం. అందుకే ఆగమేఘాల మీద కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 

#Tags