SSC Phase 10 Additional Results Released: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలక్షన్ పోస్ట్ ఫేజ్- 10 పరీక్ష ఫలితాలు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 10 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు అఫీషియల్‌ వెబ్‌సైట్‌ ssc.gov.in. ను క్లిక్‌ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

కాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలక్షన్ పోస్ట్-ఫేజ్ 10లో మిగిలి ఉన్న వివిధ ఖాళీల భర్తీకి నవంబర్‌ 18, 2022లో పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. పోస్టులను బట్టి రిజర్వేషన్‌, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా మొత్తం 680 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేశారు.

అయితే డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌లో వీరిలో కొందరిని అన్‌ఫిట్‌గా గుర్తించారు. దీంతో వివిధ కేటగిరీలో పోస్టులకు తగిన అభ్యర్థులు లేకపోవడంతో ఆ తర్వాత మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా మరికొందరు అభ్యర్థులను ఎంపిక చేశారు. తాజాగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను కమిషన్‌ విడుదల చేసింది. 

SSC Phase 10 Additional Results.. ఇలా చెక్‌ చేసుకోండి. 

1. ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ ssc.gov.in.ను క్లిక్‌ చేయండి. 
2. హోంపేజీలో కనిపిస్తున్న రిజల్ట్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
3. Phase X/2022/Selection పోస్ట్‌ అని కనిపిస్తున్న లింక్‌పై క్లిక్‌ చేయండి. 
4. తర్వాతి విండోలో ఫలితాలు కనిపిస్తాయి.. డౌన్‌లోడ్‌ చేసుకోండి. 

జాబితాలో సెలక్ట్‌ అయిన అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్స్‌ను సంబంధింత కార్యాలయానికి 10 రోజుల్లోగా అంటే మే 3 లోగా స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపించాల్సి ఉంటుందిని కమిషన్‌ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం అఫీషియల్‌ వెబ్‌సైట్‌ను స​ంప్రదించండి. 

#Tags