AFCAT 2 Notification 2024: ఏఎఫ్‌క్యాట్‌ (2)–2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఏఎఫ్‌క్యాట్, ఏఎఫ్‌ఎస్‌బీతో నియామకం!

త్రివిధ దళాల్లో ఉన్నత స్థాయి కెరీర్‌ కోరుకునే వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది. ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఏఎఫ్‌క్యాట్‌)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే..

ఎయిర్‌ఫోర్స్‌ గ్రౌండ్‌ డ్యూటీ, ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లలో.. ఆఫీసర్‌ కొలువు సొంతం చేసుకోవచ్చు. ప్రారంభంలోనే పే లెవల్‌–10తో వేతనం పొందే అవకాశం లభిస్తుంది! ఈ నేపథ్యంలో.. ఏఎఫ్‌క్యాట్‌ (2)/2024 ద్వారా భర్తీ చేసే పోస్టులు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం తదితర  వివరాలు.. 

ఎయిర్‌ఫోర్స్‌లోని పలు విభాగాల్లో (గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, నాన్‌–టెక్నికల్, ఫ్లయింగ్‌ బ్రాంచ్‌)లలో ఉన్నత పోస్ట్‌ల భర్తీ కోసం ఎయిర్‌ఫోర్స్‌ సొంతంగా నియామక ప్రక్రియ చేపడుతోంది. ఇందుకోసం ముందుగా నిర్వహించే రాత పరీక్షనే ఏఎఫ్‌క్యాట్‌ అంటారు. సాధారణంగా ఎయిర్‌ఫోర్స్‌లో ఖాళీలను ఎన్‌డీఏ, సీడీఎస్‌ఈల ద్వారా భర్తీ చేస్తా­రు. వీటికి అదనంగా ఏఎఫ్‌క్యాట్‌ విధానంలోనూ పోస్ట్‌ల భర్తీ చేపడుతున్నారు. దీంతో ఎన్‌డీఏ, సీడీఎస్‌ఈ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోలేని వారికి ఇది మరో చక్కటి మార్గంగా నిలుస్తోంది.

Assembly Elections 2024: అరుణాచల్‌లో హ్యాట్రిక్‌ విజయం సాధించిన‌ బీజేపీ.. 60 స్థానాలకు 46 కైవసం

ఏటా రెండుసార్లు
ఏఎఫ్‌క్యాట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. తాజాగా 2024కు సంబంధించి రెండో దశ నోటిఫికేషన్‌ (2/2024) విడుదలైంది. ఇందులో విజయం సాధించినవారికి 2025 జూలై నుంచి శిక్షణ తరగతులు ఉంటాయి.

మొత్తం 304 పోస్ట్‌లు
ఏఎఫ్‌క్యాట్‌ (2)–2024 ద్వారా మొత్తం 304 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ ద్వారా ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్, అలాగే ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.

TSRTC 3000 Jobs Notification 2024 Details : గుడ్‌న్యూస్.. 3000 ఆర్టీసీ ఉద్యోగాల భ‌ర్తీకి రంగం సిద్ధం.. వెంటనే భర్తీ ప్రక్రియకు కూడా..

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ
ఏఎఫ్‌క్యాట్‌లో భాగంగానే ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌లో పేర్కొన్న ఖాళీలు, అదే విధంగా ఏఎఫ్‌క్యాట్‌లో పేర్కొన్న సీట్లకు పది శాతం చొప్పున ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌కు కేటాయిస్తారు. ఈ విధానంలో దరఖాస్తు చేసుకోవాలంటే.. ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ విభాగంలో ‘సి’ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి.

అర్హతలు
ఆయా పోస్ట్‌లను అనుసరించి ఇంటర్మీడియెట్‌ (మ్యాథ్స్, ఫిజిక్స్‌), సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, నిర్దేశిత బ్రాంచ్‌లలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్,బీఎస్సీ, బీబీఏ/బీబీఎం/సీఎఫ్‌ఏ/పీజీ తదితర అర్హతలు∙ఉండాలి.

ఈ–కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, హాస్పిటాలిటీలదే జోరు

వయసు

  •     ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: జూలై 1, 2025 నాటికి 20–24 ఏళ్లు ఉండాలి. 
  •     ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు సంబంధించి కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ కలిగి ఉన్న వారికి గరిష్ట వయో పరిమితిలో రెండేళ్ల సడలింపు లభిస్తుంది. 
  •     గ్రౌండ్‌ డ్యూటీ: జూలై 1, 2025 నాటికి 20–26 ఏళ్లు ఉండాలి. 
  •     అన్ని విభాగాలకు అవివాహితులు మాత్రమే అర్హులు.


ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌(ఫ్లయింగ్‌ బ్యాచ్‌)
ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్‌ సీనియర్‌ డివిజన్‌ ‘సి’ సర్టిఫికెట్‌ ఉన్న అభ్యర్థులకు అందుబాటులో ఉన్న అవకాశం ఇది. ఎన్‌సీసీ సర్టిఫికెట్‌తోపాటు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంటర్‌లో(మ్యాథ్స్, ఫిజిక్స్‌) కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. 

Sikkim Assembly Election Result 2024: సిక్కింలో ఎస్‌కేఎం రికార్డు.. 32 స్థానాలకు 31 కైవసం!

ఏఎఫ్‌క్యాట్‌తోపాటు ఏఎఫ్‌ఎస్‌బీ
ఎయిర్‌ ఫోర్స్‌లో పలు విభాగాల్లో పోస్ట్‌ల భర్తీకి చేపట్టే ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించిన వారికి మలి దశలో ఎయిర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఏఎఫ్‌ఎస్‌బీ) పరిధిలో తుది దశ ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

300 మార్కులకు ఏఎఫ్‌క్యాట్‌
ఏఎఫ్‌క్యాట్‌ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో (జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ వెర్బల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌) 100 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షకు నిర్దేశించిన సమయం రెండు గంటలు. నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన కూడా ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

JNTUA: జేఎన్‌టీయూఏ క్యాంపస్‌లో కొత్తగా ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు..

ఏఎఫ్‌ఎస్‌బీ

  •     ఎంపిక ప్రక్రియలో తొలిదశ ఏఎఫ్‌క్యాట్‌లో అర్హత సాధించిన వారికి రెండో దశలో ఎయిర్‌ ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డ్‌ల ఆధ్వర్యంలో ఏఎఫ్‌ఎస్‌బీ టెస్టింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడంచెల్లో ఉంటుంది. ఆ వివరాలు..
  •     తొలి దశ.. స్టేజ్‌–1: ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రేటింగ్‌ టెస్ట్, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 
  •     రెండో దశ.. స్టేజ్‌–2:ఇందులో సైకలాజికల్‌ టెస్ట్‌ ఉంటుంది.ఇందులో భాగంగా అయిదు రోజుల పాటు పలు అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అదే విధంగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది.
  •     ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ అభ్యర్థులకు ప్రత్యేకంగా కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలెక్షన్‌ సిస్టమ్‌(సీపీఎస్‌ఎస్‌) విధానంలో మరో పరీక్ష కూడా నిర్వహిస్తారు. 
  •     ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ ‘సి’ సర్టిఫికెట్‌ ద్వారా ఎన్‌సీసీ ఎంట్రీకి దరఖాస్తు చేసుకున్న వారికి ఏఎఫ్‌క్యాట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.
  •     రెండు దశల్లోనూ విజయం సాధించి తుది విజేతల జాబితాలో నిలిచిన వారిని శిక్షణకు ఎంపిక చేస్తారు.
  • 74, 52 వారాల శిక్షణ
  •     తుది విజేతలుగా నిలిచిన వారికి ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ (హైదరాబాద్‌)లో శిక్షణనిస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ–టెక్నికల్‌ విభాగాలకు ఎంపికైన వారికి 74 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌–టెక్నికల్‌) బ్రాంచ్‌లకు 52 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సంబంధిత విభాగాల్లో ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా కొలువు ఖరారు అవుతుంది.

First Woman President: తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన క్లాడియా షీన్‌బామ్.. ఏ దేశానికంటే..?

ప్రారంభం వేతనం

ఎంపికైన వారికి ప్రారంభంలో నెలకు రూ.­56,100–రూ.1,77,500 వేతన శ్రేణి అందుతుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టయిఫండ్‌ ఇస్తారు. ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన వారికి షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో పదేళ్ల పాటు విధులు నిర్వర్తించే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఆసక్తి, ప్రతిభను అనుసరించి మరో నాలుగేళ్లపాటు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో మొత్తం 14 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత పర్మనెంట్‌ కమిషన్‌ హోదా పొందే అవకాశాన్ని కూడా ఎయిర్‌ఫోర్స్‌ కల్పిస్తోంది.

ముఖ్య సమాచారం

  •     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 30.05.2024
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూన్‌ 28
  •     ఏఎఫ్‌క్యాట్‌ పరీక్ష తేదీలు: 2024, ఆగస్ట్‌ 9, 10, 11 తేదీల్లో
  •     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://afcat.cdac.in

Halla Tomasdottir: ఐస్‌ల్యాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన హల్లా టోమస్‌డోత్తిర్

రాత పరీక్షలో రాణించేలా
ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ కొలువులకు అవకాశం కల్పించే ఏఎఫ్‌క్యాట్‌లో రాణించడానికి సిలబస్‌ అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. ముఖ్యంగా ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ అండ్‌ మిలటరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ అంశాలను అధ్యయనం చేయడంతోపాటు ప్రాక్టీస్‌ చేయాలి.

ఇంగ్లిష్‌
ఈ విభాగంలో స్కోర్‌ కోసం కాంప్రహెన్షన్, ఇంగ్లిష్‌ గ్రామర్, సెంటెన్స్‌ కంప్లీషన్, సెంటెన్స్‌ ఫార్మేషన్, స్పాటింగ్‌ ద ఎర్రర్, యాంటానిమ్స్, సినానిమ్స్, క్లోజ్‌ టెస్ట్, ఇడియమ్స్, ఫ్రేజెస్, అనాలజీ, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌లపై దృష్టి పెట్టాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌
చరిత్ర, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలతోపాటు జాతీయ, అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సంఘటనలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తాజా పరిణామాలు, రక్షణ రంగంలోని పరిణామాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

న్యూమరికల్‌ ఎబిలిటీ
టైమ్‌ అండ్‌ వర్క్, యావరేజెస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్, సింపుల్‌ అండ్, కాంపౌండ్‌ ఇంట్రస్ట్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, నంబర్‌ సిరీస్, పెరిమీటర్, ఏరియా, ప్రాబబిలిటీ అంశాలపై అవగాహన పొందాలి.

రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌
ఇందులో మంచి స్కోర్‌ కోసం వెర్బల్, నాన్‌–వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలతోపాటు.. సీటింగ్‌ అరేంజ్‌మెంట్, రొటేటెడ్‌ బ్లాక్స్, హిడెన్‌ ఫిగర్స్, అనాలజీపై అవగాహన పెంచుకోవాలి. 

JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఆన్సర్ కీ విడుదల..

#Tags