Skip to main content

Sikkim Assembly Election Result 2024: సిక్కింలో ఎస్‌కేఎం రికార్డు.. 32 స్థానాలకు 31 కైవసం!

సిక్కిం శాసనసభ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) సంచలన విజయం నమోదు చేసింది.
Prem Singh Tamang SKM retains power, wins 31 of 32 seats in Sikkim Assembly Election

జూన్ 2వ తేదీ జరిగిన ఓట్ల లెక్కింపులో 32 స్థానాలకు గాను ఏకంగా 31 తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. ఎస్‌కేఎం అధినేత, ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీకి దిగి రెండింటా విజయం సాధించారు. 

2019 ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకున్న ఎస్‌కేఎం ఈసారి క్లీన్‌స్వీప్ చేశారు. పోలైన మొత్తం ఓట్లలో 58.28 శాతం సాధించింది! 2019 దాకా 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన విపక్ష సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఎస్‌డీఎఫ్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పరాజయం అయ్యారు. 

బీజేపీ, కాంగ్రెస్‌ అయితే ఖాతాయే తెరవలేదు! 31 సీట్లలో పోటీ చేసిన బీజేపీకి కేవలం 5.18 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌కైతే 0.32 శాతం ఓట్లే వచ్చాయి. భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్, ఎస్‌డీఎఫ్‌ ఉపాధ్యక్షుడు బైచుంగ్‌ భూటియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే దిల్లీరామ్‌ థాపా కూడా ఓటమి చవిచూశారు. నామ్చీ జిల్లా బర్‌ఫుంగ్‌ నుంచి పోటీ చేసిన భూటియా ఎస్‌కేఎం అభ్యర్థి డోర్జీ భూటియా చేతిలో ఓటమి చవిచూశారు. డోర్జీకి 8,358 ఓట్లు, భూటియాకు 4,012 ఓట్లు లభించాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే భూటియా ఎస్‌డీఎఫ్‌లో చేరారు.

Lai Ching-te: తైవాన్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన లై చింగ్-తే

టీచర్‌ నుంచి సీఎం దాకా.. 
ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌. సిక్కింలో ఎస్‌కేఎం క్లీన్‌స్వీప్‌ వెనుక ఉన్న శక్తి. 56 ఏళ్ల తమాంగ్‌ వ్యక్తిగత చరిష్మాతోపాటు పరిపాలనాదక్షుడిగా ఆయనకున్న పేరు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఘన విజయానికి కారణమయ్యాయి. తమాంగ్‌ 1968 ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లిదండ్రులు కాలూసింగ్‌ తమాంగ్, ధన్‌మాయ తమాంగ్‌. పశ్చిమ‌బెంగాల్‌లోని డార్జీలింగ్‌లో కాలేజీ విద్య పూర్తిచేశారు.

1990లో ప్రభుత్వ ఉపాధ్యయుడిగా ఉద్యోగంలో చేరారు. మూడేళ్ల తర్వాత రాజీనామా చేసి ఎస్‌డీఎఫ్‌లో చేరారు. 15 ఏళ్లపాటు మంత్రిగా చేశారు. 2009లో నాటి సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌తో విభేదించి ఎస్‌డీఎఫ్‌ నుంచి బయటకొచ్చారు. 2013లో ఎస్‌కేఎం ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో పార్టీ 10 సీట్లు సాధించింది. అవినీతికి కేసుల్లో అరెస్టయిన తమాంగ్‌ ఏడాదిపాటు జైల్లో ఉండి 2017లో బయటికొచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 17 సీట్లు గెలిచి రెండేళ్లకే సీఎం అయ్యారు. అనంతరం పార్టీని మరింత పటిష్టపరిచారు.

Gopi Thotakura: అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తెలుగోడు.. తొలి భారత స్పేస్‌ టూరిస్ట్ ఈయ‌నే..!

Published date : 03 Jun 2024 04:20PM

Photo Stories