Army Lieutenant Posts: బీటెక్‌తోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్‌ కొలువుకు అవ‌కాశం.. ఉండాల్సిన అర్హ‌త‌లు ఇవే!

ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు చక్కని అవకాశం ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తయిందా.. ఉచితంగా బీటెక్‌ చదువుకుని, ఆర్మీలో లెఫ్టినెంట్‌ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా..

ఇందుకోసం ఇండియన్‌ ఆర్మీ అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు ఇండియన్‌ ఆర్మీ.. 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ మార్కులు, జేఈఈ మెయిన్‌ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తులు షార్ట్‌లిస్ట్‌ చేసి.. రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తిచేసుకున్న వారికి బీటెక్‌ డిగ్రీతో పాటు ఆర్మీలో లెఫ్టినెంట్‌ కొలువు సొంతమవుతుంది. విధుల్లో చేరినవారికి నెలకు లక్ష రూపాయాల వేతనం లభిస్తుంది.

బ్రేకింగ్ న్యూస్ (TS TET Results 2024): నేడు టీఎస్‌ టెట్‌ ఫలితాలు విడుదల.. ‌స‌మ‌యం ప్ర‌క‌టించిన‌ అధికారులు!

»    మొత్తం పోస్టుల సంఖ్య 90
అర్హతలు
»    ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. జేఈఈ మెయిన్స్‌ 2024 స్కోరు తప్పనిసరి. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
»    వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే.. 2005, జూలై 02 తేదీ కంటే ముందు; 2008, జూలై 01 తర్వాత జన్మించిన వాళ్లు అనర్హులు.

ఎంపిక ఇలా
ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్స్‌ 2024లో ర్యాంకు సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ మార్కులు, జేఈఈ మెయిన్స్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇలా వడపోతలో నిలిచిన వారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో బెంగళూరులో అయిదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తొలిరోజు స్టేజ్‌–1 స్క్రీనింగ్‌ (ఇంటెలిజెన్స్‌) పరీక్షల్లో అర్హత సాధించిన వారిని స్టేజ్‌–2కి ఎంపిక చేస్తారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు.

Engineering Posts: హెచ్‌పీసీఎల్‌లో ఇంజనీర్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

శిక్షణ

ఎంపికైన వారికి మొత్తం అయిదేళ్ల శిక్షణ ఉంటుంది. ఇందులో ఏడాది పాటు ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ–గయాలో బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం నాలుగేళ్లపాటు టెక్నికల్‌ ట్రైనింగ్‌ పుణె, సికింద్రాబాద్, మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒకచోట శిక్షణ కొనసాగుతుంది. ఇందులో రెండు దశలు.. ఫేజ్‌–1 మూడేళ్ల ప్రీ కమిషన్‌ ట్రైనింగ్, ఫేజ్‌–2 ఏడాది పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. మూడేళ్ల ఫేజ్‌–1 శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెల­కు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ అందుతుంది.

బీటెక్‌ డిగ్రీ
»    నాలుగేళ్ల శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదా సొంతమవుతుంది. ట్రైనింగ్, కోర్సు పూర్తయిన తర్వాత వీరికి ఇంజనీరింగ్‌ (బీటెక్‌) డిగ్రీని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ అందిస్తుంది. అనంతరం వీరిని పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు.

UPSC Recruitment 2024: యూపీఎస్సీలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన పోస్టులు..

వేతనాలు
లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేరిన వారికి లెవల్‌–10 ప్రకారం–మూలవేతనం లభిస్తుంది. ఇలా ఎంపికైన వారికి ప్రతి నెల రూ.56,100తో పాటు మిలటరీ సర్వీస్‌ పే కింద నెలకు రూ.15,500 అందుతాయి. వీటితోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు లభిస్తాయి. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే అన్ని కలుపుకొని సీటీసీ రూపంలో నెలకు దాదాపు లక్ష రూపాయాలు అందుకోవచ్చు. స్వల్ప వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత కెప్టెన్, ఆరేళ్ల సర్వీస్‌తో మేజర్, పదమూడేళ్ల అనుభవంతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలను అందుకోవచ్చు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 13.07.2024
»    వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/Authentication.aspx

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో పాల్గొనే తెలుగ‌మ్మాయి ఈమెనే..

#Tags