Best Treatment for Students: ఆనారోగ్యం పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి..

అనారోగ్యం పాలైన విద్యార్థుల్ని ఆస్పత్రికి తరలించారు పాఠశాల సిబ్బందులు. వారిని పరామర్శించేందుకు పాడేరు ఐటీడీఏ పీవో ఆసుపత్రికి సందర్శించారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ ఆదేశించారు. ఆనారోగ్యానికి గురై పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతగిరి, ముంచంగిపుట్టు, పాడేరు మండలాల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను ఆదివారం ఆయన పరామర్శించారు.

Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలతో ... లక్ష్యంగా

వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విద్యార్ధుల కోసం జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించి వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న వైద్య పరికరాలను వినియోగంలోకి తేవాలని సూచించారు. జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది కొరతపై ఐటీడీఏ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌కు లేఖ రాస్తామన్నారు.

Tenth Class Public Exams 2024: పదవతరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు

ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న ముగ్గురు విద్యార్థినుల్లో పరిస్థితి విషమంగా ఉన్న ఒకరిని విశాఖపట్నం తరలించినట్టు సూపరింటెండెంట్‌ తెలిపారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పీవో పేర్కొన్నారు. ఆశ్రమ పాఠ శాలల్లో విద్యార్థుల మరణాలు సంభవిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట గిరిజన సంక్షేమ శాఖ డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూవో రజని ఉన్నారు.

#Tags