Kendriya Vidyalaya Steel Plant: కేంద్రీయ విద్యాలయాన్ని కొనసాగిస్తాం

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ కేంద్రీయ విద్యాలయం (కేవీ)ను మూసివేయబోమని, యథావిధిగా కొనసాగిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.

ఇటీవల కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతి, 11వ తరగతులకు నూతన చేరికలు నిలిపివేస్తున్నారని, క్రమేపి కేవీని మూసి వేస్తారని వస్తున్న ప్రచారం మేరకు స్టీల్‌ ఐఎన్‌టీయూసీ నాయకులు హెచ్‌ఆర్‌ సీజీఎం జి.గాంధీను కలిశారు. కేవీని యథావిధిగా నడపాలని, గతంలో మాదిరిగా సెక్షన్‌లు కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు.

దీనిపై అధికారులు మాట్లాడుతూ స్కూల్‌ను మూసివేసి ప్రభుత్వానికి అప్పగించాలని మొదట అనుకున్నప్పటికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఆర్‌ జీఎం ఎం. మధుసూదనరావు, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌, అధ్యక్షుడు నీరుకొండ రామచంద్రరావు, ఎస్‌.ఎ. నాయుడు, పి.వి. నగేష్‌, రాథోడ్‌, సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.

#Tags