Students Excursion: ఉత్తమ మార్కులకు విహార యాత్ర అవకాశం.. ఈ విద్యార్థులకే..
Sakshi Education
పదో తరగతి బోర్డు పరీక్షలో విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధిస్తే వారికి విహార యాత్ర అవకాశం దక్కుతుందని ప్రకటించారు ఆలయ కమిటీ సభ్యుడు ఉమాపతి..

సత్యవేడు: మాధనసాళెం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధిస్తే విమానంలో విహాయ యాత్రకు పంపుతానని సురుటుపల్లె ఆలయ కమిటీ సభ్యుడు ఉమాపతి ప్రకటించిన విషయం విధితమే. అందులో భాగంగా విద్యార్థులు పురుషోత్తం(552), వి. విష్ణు( 515),మహా(509), తనూజ(505)తోపాటు ప్రధానోపాధ్యాయుడు మునిమోహన్‌ను శుక్రవారం చైన్నె నుంచి హైదరాబాద్‌కు విమానంలో పంపించారు.
Girls Gurukul Admissions: మైనార్టీ గురుకులంలో పరీక్ష లేకుండానే ప్రవేశాలు!
టికెట్లతోపాటు విద్యార్థుల రెండు రోజుల విహార యాత్రకు అయ్యే మొత్తం ఖర్చును ఉమాపతే భరిస్తున్నారు. ఈ మేరకు ఉమాపతిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
Published date : 20 May 2024 11:23AM