TS 10th Class Hall Tickets 2024 Download : టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌.. నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జ‌ర‌గున్నాయి. ఈ పరీక్షలు పరీక్ష రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి.

ఈ టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్‌టికెట్లు మార్చి 7వ తేదీన విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రింటెడ్ హాల్‌టికెట్లను స్కూల్స్‌కు పంపించారు. అయితే టెన్త్ క్లాస్ విద్యార్థులు స్కూళ్ల యాజ‌వాన్యాల‌తో సంబంధం లేకుండానే నేరుగా వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చును. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2024 కు సంబంధించిన హాల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అందుబాటులో ఉంచింది.

☛ Tenth Class Exams 2024: పరీక్ష హాల్‌లో ఒత్తిడికి గురికావొద్దు... ఈ చిట్కాలు పాటించి ఒత్తిడిని జయించండి!

రాష్ట్రవ్యాప్తంగా 5.08 ల‌క్ష‌ల మంది విద్యార్థులు..

ఈ సారి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2676 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఈ టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 5.08 ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌రుకానున్నారు. ఈ సారి గత అనుభవాల దృష్ట్యా మాల్ ప్రాక్టీస్‌ను అడ్డుకునేందుకు, ప్రశ్నాపత్రాల నిర్వహణ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నారు.  ఏపీలో ఇప్పటికే టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల  హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

☛ 10th Class Preparation Tips: టెన్త్‌ క్లాస్‌లో.. పదికి పది గ్రేడ్‌ పాయింట్లు సాధించేందుకు సబ్జెక్ట్‌ వారీగా ప్రిపరేషన్‌ టిప్స్‌..

హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోండిలా..

10వ తరగతి ప‌బ్లిక్‌ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్  చేసుకోవ‌చ్చును. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 10వ తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు బదులు ఏడు పేపర్లుగా మార్చి ఈసారి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి సైన్స్ సబ్జెక్టులను రెండు పరీక్షలుగా నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్ పార్ట్–1 గాను బయాలజికల్ సైన్స్ పార్ట్–2 గాను నిర్వహించనున్నారు. ఈ సైన్స్ సబ్జెక్టుల రెండు పేపర్లను ఉదయం 9:30 నుంచి 11.00 గంటల వరకు నిర్వహించనున్నారు.

☛ After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

TS SSC Hall Tickets 2024 డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..
☛ మొదట అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.telangana.gov.in/ ను క్లిక్‌ చేయండి.
☛ మెయిన్ పేజీలో TS SSC Hall Tickets 2024 డౌన్‌లోడ్ లింక్‌ పై క్లిక్ చేయండి
☛ మీ వివరాలు నమోదు చేసి, సబ్మిట్ బటన్‌ను క్లిక్‌ చేయండి
☛ తర్వాతి పేజీలో పదో తరగతి హాల్ టికెట్‌ కనిపిస్తుంది
☛ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోవచ్చు.

☛ Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

#Tags