AP Govt Schools: పాఠశాలలో ‘స్వచ్ఛతా పక్వాడ్‌’

సత్తెనపల్లి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలల్లో స్వచ్ఛతా పక్వాడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమాల అమలుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం 10 రోజులకు కార్యక్రమాలను నిర్దేశించింది. జిల్లాలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలు అమలు చేసేలా ఆదేశాలిచ్చింది. పరిసరాలు శుభ్రత, ఆరోగ్యం, చేతులు కడుక్కోవడం, మాస్క్‌ల వినియోగం, తదితర అంశాలను ఇందులో పొందుపరిచింది. సమగ్ర శిక్ష యంత్రాంగం ఈ కార్యక్రమాలను పర్యవేక్షించనుంది. దీనిలో భాగంగా శుక్రవారం పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో స్వచ్ఛత శపథం నిర్వహణ చేపట్టారు.

చ‌ద‌వండి: AP Residential School: విద్యార్థులకు కొత్త ట్యాబ్‌లు

ఇవీ కార్యక్రమాలు ..
2న : పిల్లలకు శుభ్రత, చేతులు కడుక్కోవడం, మాస్క్‌ల వినియోగం, సామాజిక దూరం పాటించడం వంటి అంశాలపై అవగాహన.
4న : మరుగుదొడ్ల వినియోగం, మంచినీరు పొదుపుగా వాడకం, నీటిపై అవగాహన కల్పించడం.
6న : ప్లాస్టిక్‌ నిషేధం, మరుగుదొడ్ల నిర్వహణపై అవగాహన, పోటీలు, కొవిడ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం.
7న : పరిశుభ్రతపై చిత్రలేఖన, క్విజ్‌, వ్యాస, నినాదాల పోటీల నిర్వహణ.
9న : భోజనానికి ముందు, తర్వాత చేతుల శుభ్రత, దివ్యాంగ విద్యార్థుల సౌకర్యాలపై అవగాహన
11న : స్వచ్ఛతపై అవగాహన సందేశాలను పాఠశాల విద్య వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేయడం, విద్యార్థుల చేతి గోళ్లు కత్తిరించడం, రోజూ స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు, పాదరక్షలు ధరించటంపై అవగాహన.
12న : వివిధ అంశాలపై ఫొటోలు, వీడియోలు, పోస్టర్లు, పెయింటింగ్‌లు, స్వచ్ఛతా ఛాయా చిత్రాలను ప్రదర్శించడం.
13న : స్వచ్ఛతా పక్వాడ్‌ కార్యక్రమంపై ప్రజల నుంచి సలహాలు స్వీకరించడం, కార్యక్రమంలో చేపట్టిన అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ.
15న : నిర్దేశించిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం, ప్రశంసా పత్రాలు పంపిణీ.

#Tags