Awareness Program : టెన్త్ తరువాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి
పాడేరు: మార్గదర్శి కార్యక్రమాన్ని విద్యా సంస్థల్లో విజయవంతం చేసి తద్వారా విద్యార్థుల ఉన్నత చదువులకు బాటలు వేయాలని ఐటీడీఏ పీవో అభిషేక్ ఆదేశించారు. స్థానిక కాఫీ గెస్ట్ హౌస్‌లో శుక్రవారం ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల ఏటీడబ్ల్యూవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలకు విద్యార్థుల కెరీర్ గైడెన్స్‌పై నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టెన్త్ తర్వాత చదువులు, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.
Railway Recruitment 2024: రైల్వేలో 1785 పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
వృత్తి విద్యా, వృత్తి మార్గదర్శకం, వృత్తి అంచనా, వృత్తి సమాచారం అనే అంశాలపై ఆయన విఫులంగా వివరించారు. విద్యార్థులు సామాజిక అలోచాన విధానంలో మార్పు తీసుకురావాలన్నారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో తెలుసుకున్న అంశాలను విద్యార్థులకు బోధించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీ రజనీ, డీఈవో బ్రహ్మాజీరావు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)