Scholarship for Students: స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హ‌త సాధించుకున్న విద్యార్థులు

ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష‌లో పాల్గొని ఎంపికైన విద్యార్థుల‌కు స్కాలర్‌షిప్ అంద‌జేస్తామ‌ని ఇటీవ‌లె ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే అర్హ‌త సాధించిన విద్యార్థుల‌ను ఎంపిక చేసి స్కాలర్‌షిప్ ల‌ను అందించారు.
HM Mutyala Rao giving the scholarship certificates and appreciating them

సాక్షి ఎడ్యుకేష‌న్: జాతీయస్థాయిలో నిర్వహించిన నేషనల్‌ మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షల్లో ఇందుకూరుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్టు హెచ్‌ఎం వి.ముత్యాలరావు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న గొర్రిల మంజుల, శరకణం నాగచైతన్య శ్రీగణేష్‌, కాసాని వీరవెంకట రామకృష్ణ, మూలపర్తి వాణి సంజన, ఇజ్జన సాయి అలెక్స్‌ స్కాలర్‌షిప్‌ పొందేందుకు అర్హత సాధించారని ఆయన పేర్కొన్నారు.

Scholarship Application: విద్యార్థుల‌ స్కాలర్‌షిప్‌ల ద‌ర‌ఖాస్తు గ‌డువు..

వీరికి కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.12 వేల చొప్పున ఐదేళ్లపాటు అందింస్తుందని ఆయన వెల్లడించారు. ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తారని, ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులన్నారు. ఎంపికైన విద్యార్థులను ఎస్‌ఎంసీ చైర్మన్‌ గొర్రిల శ్రీను, ఉపాధ్యాయులు అభినందించారు.

#Tags