Scout and Guides: విద్యార్థుల క్రమశిక్షణకు స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌..

క్రమశిక్షణ విద్యార్థల్లో ఎంతో అవసరం. ఈ కారణంగా స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ అనే సంస్థ జీఆర్‌టీ ఇంగ్లీష్‌ పాఠశాలకు సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమైయ్యారు. ఇలా శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలిపారు అధికారులు..

మదనపల్లె సిటీ: స్కౌట్‌తో క్రమశిక్షణ అలవడుతుందని స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ అన్నమయ్య జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం మదనపల్లెలోని జీఆర్‌టీ ఇంగ్లీష్‌ హైస్కూల్లో స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ యూనియన్‌ లీడర్స్‌కు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కౌట్‌ అండ్‌ గైడ్‌ ఏర్పాటు కోసం మొదట రూ.381 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. స్కౌట్స్‌, గౌడ్స్‌లు బేసిక్‌ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని వివరించారు.

TSGENCO: 31న జెన్‌కో ఏఈ, కెమిస్ట్‌ పరీక్షపై సందిగ్ధం

ఈ స్కౌట్‌, గైడ్‌ సర్టిఫికెట్లు పొందిన వారికి జీవో నంబర్‌ 27 ప్రకారం విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్‌ ఉంటుందని అసిస్టెంట్‌ సెక్రటరీ భాస్కర్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీటీఎం ఎంఈవో నారాయణ, కొత్తకోట ఎంఈఓ రెడ్డిశేఖర్‌, అసిస్టెంట్‌ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కమీషనర్‌ లక్ష్మీకర్‌,ఆంగ్ల ఉపాధ్యాయుడు మహమ్మద్‌ఖాన్‌, రీసోర్స్‌ కమిటీ సభ్యులు లక్ష్మిరెడ్డి,కట్‌ మాస్టర్లు సుబ్బారెడ్డి,లక్ష్మిపతి, విద్యాధర తదితరులు పాల్గొన్నారు.

Chess Tournament: చెస్‌ టోర్నమెంట్‌లో గ్రామీణ క్రీడాకారుల ఘనత

#Tags