Skip to main content

CBSE for Govt Schools: సీబీఎస్ఈ ఎక‌పై ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో కూడా..

పాఠ‌శాలలో పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించే క్ర‌మంలో స‌ర్కారు బడుల్లో కూడా సీబీఎస్ఈ సిల‌బ‌స్‌కు చ‌ర్య‌లు ప్రారంభం అయ్యాయి..
CBSE syllabus for government school students also

సత్తెనపల్లి: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. విజ్ఞాన కాంతులు వెదజల్లుతున్నాయి. ప్రతిఒక్కరికీ నాణ్యమైన విద్యనందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. అందుకు అనుగుణంగా సర్కారు బడుల్లో సంస్కరణలు చేపట్టారు. నాడు– నేడు కింద పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దారు. డిజిటల్‌ విద్య అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం బైలింగ్విన్‌ విధానంలో పాఠ్యపుస్తకాలు ముద్రించింది.

First Judge in California: అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం.. ఈమె ఎవ‌రో తెలుసా..

సీబీఎస్‌ఈతో ముందడుగు..

కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు బోధించే సీబీఎస్‌ఈ సిలబస్‌ను సర్కారు బడుల్లో అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దశల వారీగా పాఠశాలలను ఎంపిక చేసింది. తొలుత ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అమలు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అమలు చేయనున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తోంది. జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేయనున్నారు.

పాఠశాలల ఎంపిక ఇలా...

సీబీఎస్‌ఈ కింద జిల్లాలోని 67 పాఠశాలలను తొలుత ఎంపిక చేశారు. వీటిల్లో 13 మోడల్‌ స్కూల్స్‌, 24 కేజీబీవీలు, 11 ఏపీ రెసిడెన్షి యల్‌ పాఠశాలలు, 19 జెడ్పీహెచ్‌ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో బట్టి విధానానికి, మూస పద్ధతికి స్వస్తి పలికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ను అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియపై జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో సీబీఎస్‌ఈకి ఎంపిక కాబడిన 67 పాఠశాలల్లో పని చేస్తున్న పీజీటీ, జేఎల్స్‌ ఉపాధ్యాయులందరికీ నరసరావుపేటలోని శంకర భారతీపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ నెల 17, 18న ఇంగ్లిష్‌, సోషల్‌, బయాలజీ సబ్జెక్టులకు కేటాయించిన 386 మందికి, 20, 21న మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులకు కేటాయించిన 341 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.

MANUU Admissions 2024: పాలిటెక్నిక్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు.. వారే దరఖాస్తుకు అర్హులు

పేద విద్యార్థులకు ప్రోత్సాహం..

ఇప్పటి వరకు కార్పొరేట్‌, ఇతర ప్రత్యేక పాఠశాలల్లోనే సీబీఎస్‌ఈ విధానం అమలవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న పోటీ ప్రపంచంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలంటే సీబీఎస్‌ఈ సిలబస్‌ కచ్చితంగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల విద్యార్థులకూ ఇటువంటి బోధన అందించాలన్న సంకల్పంతో చర్యలు తీసుకుంది. అన్ని రకాల వనరులూ ఉండి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో దీన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుకునే అవకాశం ఉంది. ఆయా విద్యాలయాల పర్యవేక్షణ కేంద్రం ప్రభుత్వ పరిధిలోకి వెళ్తుంది. విద్యార్థుల ఆసక్తి, అభిరుచిని గుర్తించి వివిధ రంగాల్లో వారిని ప్రోత్సహిస్తారు.

తొలి విడతగా జిల్లాలో 67 పాఠశాలలు ఎంపిక 9 నుంచి ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు 17 నుంచి 21వ తేదీ వరకు ఉపాధ్యాయులకు శిక్షణ

Teacher's Achievement: ప్రైవేట్‌ కళాశాల అధ్యాపకునికి అమెరికా జీహెచ్‌పీయూ గుర్తింపు..!

పోటీ ప్రపంచంలో రాణించేందుకు దోహదం

పోటీ ప్రపంచంలో విద్యార్థుల సామర్‌ాధ్యన్ని పెంచుకొని జాతీయ పరీక్షలకు హాజరు కావడానికి సీబీఎస్‌ఈ సిలబస్‌ దోహదపడుతుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా గా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరం.

–ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, పల్నాడు

Girls School Admissions: నూత‌న విద్యా సంవ‌త్స‌రానికి బాలికోన్న‌త పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశ ద‌ర‌ఖాస్తులు..

Published date : 23 May 2024 12:06PM

Photo Stories