Skip to main content

TSGENCO 2024 Postponed: 31న జరగాల్సిన ఏఈ, కెమిస్ట్‌ పరీక్ష వాయిదా... కొత్త తేదీ...

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో అసిస్టెంట్‌ ఇంజనీర్లు, కెమిస్ట్‌ ఉద్యోగాల భర్తీ కోసం మార్చి 31న నిర్వహించాలని యోచిస్తున్న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఏఈ, కెమిస్ట్‌ పరీక్ష వాయిదా.
Central Election Commission    Confusion over Genco AE Chemist Exam on 31st    Sakshi, Hyderabad: The Telangana Electricity Generating Corporation (GENCO) management has sought permission from the Central Election Commission to conduct the Computer Based Test (CBT) to be held on March 31 for filling the posts of Assistant Engineers and Chemists.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో, పరీక్ష నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి తప్పనిసరి. మార్చి 23 నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచాల్సి ఉండగా, ఈసీ అనుమతి కోసం జెన్‌కో ఎదురుచూస్తోంది. ఈసీ అనుమతి కోసం జెన్‌కో యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది.

చదవండి: TS TRANSCO & TSGENCO Jobs: ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

31న పరీక్ష నిర్వహణపై ఈసీ నిర్ణయం ఆధారంగా షెడ్యూల్‌ ఖరారు చేస్తామని జెన్‌కో వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులకు తెలియజేసారు. కానీ తక్కువ సమయం వలన... ఇంకా ఎటువంటి సమాచారం లేనందువలన... పరీక్షని వాయిదా వేశారు. 

339 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పోస్ట్‌లు

టీఎస్‌ జెన్‌కో 339 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీటెక్‌ అర్హతతో ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు.

నాలుగు బ్రాంచ్‌లు.. 339 పోస్ట్‌లు

  • టీఎస్‌ జెన్‌కో తాజా నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం నాలుగు బ్రాంచ్‌లలో 339 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–145 పోస్ట్‌లు, లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌– 42 పోస్ట్‌లు.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(మెకానికల్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–74 పోస్ట్‌లు; లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌–3 పోస్ట్‌లు.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రానిక్స్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–25 పోస్ట్‌లు.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–1,లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌–49 పోస్ట్‌లు
  • నాలుగు బ్రాంచ్‌లకు సంబంధించి లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ పరిధిలో 94 పోస్ట్‌లు, జనరల్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో 245 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

విద్యార్హతలు

  • ఏఈ(ఎలక్ట్రికల్‌): ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌తో బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
  • ఏఈ(మెకానికల్‌): మెకానికల్‌ బ్రాంచ్‌తో బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.
  • ఏఈ(ఎలక్ట్రానిక్స్‌)ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(ఈసీఈ)/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ పవర్‌/పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి.

వేతనం

తుది విజేతల జాబితాలో నిలిచి నియామకం ఖరారు చేసుకుంటే.. రూ.65,600–రూ.1,31,220 వేతన శ్రేణిలో ప్రారంభ వేతనం లభిస్తుంది.

ఎంపిక ఇలా

రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా రిజర్వేషన్లు, లోకల్‌ కేడర్‌ తదితర నిబంధనలను అనుసరించి తుది జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో నిలిచిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు. ఆ క్రమంలో ఆయా కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కుల నిబంధనను అమలు చేస్తారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్‌, క్రీడాకారుల కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు; బీసీ అభ్యర్థులు 35 శాతం మార్కులు; ఎస్‌సీ/ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు; పీహెచ్‌ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాఽధించాలి.

వంద మార్కులకు పరీక్ష

  • రాత పరీక్షను రెండు విభాగాలుగా 100 మార్కులకు నిర్వహిస్తారు.
  • పార్ట్‌–ఎలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌ నుంచి 80 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్‌–బిలో ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, సంస్కృతి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నమోదైన అభివృద్ధి, బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాల నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష 3 దశల్లో నిర్వహించబడుతుంది:

  • ఉదయం 9 నుండి 10.40 వరకు: మెకానికల్ మరియు కెమిస్ట్
  • 1 PM నుండి 2.40PM: ఎలక్ట్రికల్
  • 5 PM నుండి 6.40 PM: సివిల్ & ఎలక్ట్రానిక్స్
Published date : 29 Mar 2024 11:47AM

Photo Stories