School Students : విద్యార్థుల డేటాను ఈ వెబ్‌సైట్‌లో న‌మోదు చేయాలి.. విద్యాశాఖ కీల‌క ఆదేశం..

సాక్షి ఎడ్యుకేష‌న్: పాఠశాల విద్యార్థుల డేటాను ప్రకటించిన తేదీలోగా యూడైస్ ప్ల‌స్ వెబ్‌సైట్‌లో న‌మోదు చేయాల‌ని స్కూళ్ల‌ను విద్యాశాఖ ఆదేశించింది. ప్ర‌తి విద్యార్థిని ట్రాక్ చేసేలా డేటా ఉండాల‌ని డీఈఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలు స్కూల్‌ టీచ‌ర్ల‌కు తెలియ‌జేస్తున్నారు.

Ph D Admissions : ట్రిపుల్‌ఐటీడీఎంలో ఫుల్‌టైం పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

ఏ ఒక్క విద్యార్థిని వదలకుండా ‍ప్రతీ విద్యార్థి డేటాను వ‌చ్చే నెల అంటే.. సెప్టెంబ‌ర్ 6వ తేదీలోగా వెబ్‌సైట్‌లో డేటాను స‌మ‌ర్పించాలని వివ‌రించారు. దీని ఆధారంగా మ‌ధ్యాహ్న భోజ‌నం, అల్పాహారం, ఏక‌రూప దుస్తులు, పుస్త‌కాలు, స్కాల‌ర్‌షిప్‌, ర‌వాణా భ‌త్యం వంటి వాటికి కేంద్రం బ‌డ్జెట్ కేటాయిస్తుందని స్వష్టం చేశారు విద్యాశాఖ అధికారులు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనాన్ని అందజేయాలని కోరారు.

#Tags