School Inspection: ఆశ్రమ పాఠశాల తనిఖీ..!

ఆశ్రమ పాఠశాలను ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ సందర్శించారు. విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలను ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి.శంకర్రావు శుక్రవారం సందర్శించారు. ఇటీవల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థి అశోఖ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్థి మృతికి గల కారణాలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలు, భోజనం, విద్యాబోధన తదితర అంశాలపై ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థుల చదువు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

ISRO Opportunity: విద్యార్థులకు ఇస్రో కల్పిస్తున్న గొప్ప అవకాశం..

విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థి అశోఖ్‌ మృతి చెందడం, బాధాకరమని, మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి, విద్యార్థులు ఆరోగ్య పరిస్థితిని ఉపాధ్యాయులు తెలుసుకోవాలన్నారు. జిల్లా ఉన్నతాధికారులు తరుచూ ఆశ్రమ పాఠశాలలను పర్యవేక్షించాలన్నారు. వసతిగృహ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాల సందర్శనలో సహాయ గిరిజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

#Tags