School Holidays Extented In 2025: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. జనవరి 15 వరకు అన్ని స్కూల్స్‌ బంద్‌

విద్యార్థులకు ఈ మధ్యకాలంలో వరుసగా సెలవులు వస్తున్నాయి. అసలే ఇది చలికాలం. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రోజురోజుకి చ‌లి తీవ్ర‌త విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే శీతాకాల సెలవులను ప్రకటించారు. అయితే గత కొన్ని రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగిపోయింది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని రాష్ట్రాలు శీతాకాల సెలవులను పొడిగించారు.
School Holidays Extented In 2025

ప్రభుత్వ, ప్రైవేట్-ఎయిడెడ్ పాఠశాలల పాఠశాల సమయాలను ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటలకు మార్చారు. వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలను చలి నుంచి కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్కూళ్లకు ఎప్పటివరకు సెలవులు ప్రకటించారు? మళ్లీ పునఃప్రారంభం ఎప్పుడన్నది ఈ కథనంలో తెలుసుకుందాం. 
 

జార్ఖండ్
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 7 -13 వరకు శీతాకాల సెలవులు

ఉత్తర ప్రదేశ్ (యూపీ):
డిసెంబర్ 25 నుండి 2025 జనవరి 5 వరకు శీతాకాల సెలవులు.
అన్ని స్కూళ్లకు జనవరి 10 వరకు సెలవులు పొడిగించారు. మళ్లీ పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటారన్నది త్వరలోనే ప్రకటిస్తారు

School holidays: అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కారణమిదే!

పంజాబ్:
గతంలో డిసెంబర్ 24- 31 వరకు సెలువులు ప్రకటించారు. అయితే వాతావరణ పరిస్థితుల ఆధారంగా జనవరి 7 వరకు  సెలవులు పొడిగించారు. 



ఢిల్లీ:
2026-26 విద్యా సంవత్సరానికి జనవరి 1 నుండి జనవరి 15 వరకు శీతాకాల సెలవులు.
జనవరి 16న తరగతులు పునః ప్రారంభమవుతాయి
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలపై ఈ నిబంధన వర్తిస్తుంది.

హర్యానా:
 జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ప్రకటించారు. 

Mega Career Fair : టెన్త్‌ అర్హతతో.. 400 ఉద్యోగాలు, ఇంటర్వ్యూ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

రాజస్థాన్:
డిసెంబర్ 25 నుంచి జనవరి 5 వరకు శీతాకాలపు సెలవులు ప్రకటించారు. 

బీహార్:
జనవరి 11 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags