School Admisssions 2024: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లకు విద్యార్థుల ఎంపిక

ఆసిఫాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు 2024– 25 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులను లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక చేశామని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి తెలి పారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్‌ దాసరి వేణు(రెవెన్యూ), డీటీడీవో రమాదేవితో కలిసి విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహించారు.

ఆయన మాట్లాడు తూ బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో 3, 5, 8 తరగతు ల కోసం 33 మందిని ఎంపిక చేశామని తెలిపారు. మూడో తరగతిలో ఇద్దరు, ఐదో తరగతిలో ఒకరు ఆదిమ గిరిజనులు, షెడ్యూల్డ్‌ ఏరియాల నుంచి 3, 5, 8 తరగతులకు ఒక్కొక్కరు చొప్పున.. అలాగే సాధారణ విద్యార్థులను మరో 27 మందిని ఎంపిక చేశామని పేర్కొన్నారు.

Government School Admissions: కార్పేరేట్‌ స్కూల్‌కి ధీటుగా డిమాండ్‌.. ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మీషన్స్‌ కోసం క్యూ కడుతున్న తల్లిదండ్రులు

విద్యార్థులకు ఉచిత భోజన, విద్య, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాధికారి మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్‌, సహాయ గిరిజన అధికారి క్షేత్రయ్య, జెడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags