Skip to main content

Government School Admissions: కార్పేరేట్‌ స్కూల్‌కి ధీటుగా డిమాండ్‌.. ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మీషన్స్‌ కోసం క్యూ కడుతున్న తల్లిదండ్రులు

Former minister Tanniru Harish Rao  Government School Admissions Indiranagar Zilla Parishad Government High School

సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి మీ పిల్లలను మా పాఠశాలలో జాయిన్‌ చేయించాలని తల్లిదండ్రులను కోరుతుంటారు. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో సీన్‌రివర్స్‌గా మారింది. తల్లిదండ్రులే తమ పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ప్రవేశాల కోసం క్యూ కడుతున్నారు.

అది ఎక్కడ అనుకుంటున్నారా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నతపాఠశాల. ఈ పాఠశాలను మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత తీసుకున్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా విద్యాబోధన అందిస్తుండటంతో ప్రవేశాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ పాఠశాలలో 1,208 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలోనే మూడో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలగా దీనికి గుర్తింపు వచ్చింది.  

6 నుంచి 10వ తరగతి వరకు.. 
ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికిగాను 6 నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. 6వ తరగతిలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అదే పాఠశాల ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 5వ తరగతి పూర్తి చేసి.. 6వ తరగతి ప్రవేశం కోసం 61 మంది వచ్చారు.

TS ICET 2024 Results Declared: ఐసెట్‌ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి.. టాప్‌-10 ర్యాంకర్లు వీళ్లే..

ఇంకా 129 సీట్లకు ఇతర పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు 161 సీట్లు ఖాళీగా ఉండగా 630 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. దీంతో ప్రతిభ ఉన్న వారికి అవకాశం కలి్పంచాలనే ఉద్దేశంతో ఈ నెల 13న విద్యార్థులకు ప్రవేశపరీక్ష నిర్వహించారు.  

ఇఫ్లూ దత్తత
ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైదరాబాద్‌కు చెందిన ఇఫ్లూ (ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌) యూనివర్సిటీ దత్తత తీసుకుంది. 9వ తరగతి విద్యార్థులకు స్పాని‹Ù, ఫ్రెంచ్, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేరి్పస్తున్నారు. 150 మంది విద్యార్థులకు వివిధ భాషలు నేరి్పంచారు. ఈ ఏడాది మరో 150 మందికి నేరి్పంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. గురు, శుక్ర వారాల్లో ఆన్‌లైన్‌లో బోధిస్తుండగా, తరగతిగదిలో శనివారం ప్రొఫెసర్లు నేరుగా వచ్చి బోధిస్తున్నారు. విద్యార్థులు ధారాళంగా స్పాని‹Ù, ఫ్రెంచ్‌ భాషల్లో మాట్లాడుతున్నారు. డ్రామా, స్కిట్‌లు, సాంగ్స్‌ కూడా పాడుతున్నారు.

రోబోటిక్స్‌... 
ఇందిరానగర్‌ పాఠశాలలో రోబోటిక్స్‌ విద్యను హైదరాబాద్‌కు చెందిన సోహం అకడమిక్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది. మూడు సంవత్సరాలుగా ప్రతీ ఏడాది 100 మంది విద్యార్థులకు నేరి్పస్తున్నారు. వారంలో రెండు రోజులు క్లాసులు నిర్వహిస్తున్నారు.

గర్వపడుతున్నాం..  
మెరుగైన విద్య, సౌకర్యాలు క­ల్పింస్తుండటంతో విద్యార్థుల­ను చేర్పించేందుకు తల్లిదండ్రు­లు ముందుకు వస్తున్నారు. అం­దు­­కు గర్వపడుతున్నాం. విద్యార్థుల తాకిడి పెర­గడంతో స్క్రీనింగ్‌కు పరీక్ష పెట్టాం. వీటిలో వచి్చన మార్కులు, వారి కుటుంబపరిస్థితిని బట్టి అడ్మిషన్లు ఇస్తాం. ఈ నెల 20తేదీలోగా ఎంపిక పూర్తవుతుంది.  
– రాజప్రభాకర్‌రెడ్డి, హెచ్‌ఎం, జెడ్పీ హైసూ్కల్, ఇందిరానగర్‌ 

సీటు కోసం వచ్చాను  
మా తమ్ముడి భార్య చనిపోయింది. నా మేనల్లుడిని ఇందిరానగర్‌ స్కూల్‌లో 6వ తరగతిలో చేరి్పంచేందుకు వచ్చాను. పరీక్ష రాయించాను. ఇందులో చదివితే విద్యావంతుడు అవుతాడని నమ్మకంతో సీటు కోసం తిరుగుతున్నా.  
– బాలలక్ష్మి, సిద్దిపేట

ఈ ఏడాది కొత్తగా ఎన్‌సీసీ 
ఈ ఏడాది కొత్తగా ఎన్‌సీసీ ప్రవేశపెట్టారు. కరీంనగర్‌కు చెందిన 9వ బెటాలియన్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. 8వ తరగతి నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. 

⇒ ఈ పాఠశాల విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ, కా ర్పొరేట్‌ కళాశాలలో ఉచిత సీట్లకు ఎంపికవుతున్నారు. 2023–2024 విద్యా ఏడాదిలో 231 మంది పదో తరగతి పరీక్ష రాయగా 229 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇటీవల విడుదలైన పాలిసెట్‌లో వెయ్యిలోపు ఐదుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు.

Published date : 15 Jun 2024 11:23AM

Photo Stories