School Admissions: పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌ల్లో చేర్పించే ముందు.. త‌ల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

అడ్మిషన్లు తీసుకోవడానికి ముందే తల్లిదండ్రులు అప్రమత్తమై సదరు విద్యాసంస్థకు అన్ని అనుమతులు ఉన్నాయో లేదో, మౌలిక సదుపాయాల కల్పన ఎలా ఉందో సరి చూసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు..

అమలాపురం: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు మంచి విద్యాలయాల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇదే సమయంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లపై దృష్టి సారించాయి. చాలా విద్యాసంస్థలు తమకు ప్రభుత్వ గుర్తింపు, రిజిస్ట్రేషన్‌ లేకుండానే అడ్మిషన్ల పర్వానికి తెర తీశాయి. ఆకర్షణీయమైన బ్రోచర్లు, ప్రకటనలు, ప్రచారాలతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందుకే అడ్మిషన్లు తీసుకోవడానికి ముందే తల్లిదండ్రులు అప్రమత్తమై సదరు విద్యాసంస్థకు అన్ని అనుమతులు ఉన్నాయో లేదో, మౌలిక సదుపాయాల కల్పన ఎలా ఉందో సరి చూసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

Admissions of Social Welfare Gurukulas : సాంఘిక సంక్షేమ గురుకుల ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

● తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలనుకునే ప్రైవేటు పాఠశాలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉందో లేదో తెలుసుకున్న తరువాతే అడ్మిషన్‌ పొందాలి.

● సదరు పాఠశాలలో మౌలిక వసతులైన తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, క్రీడా ప్రాంగణం, గాలి, వెలుతురు సక్రమంగా ఇచ్చే భవనాలు ఎంత వరకూ ఉన్నాయనే అంశాలను ముందస్తుగా పరిశీలించుకోవాలి.

● తమ పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే వాహనాలు ఎలా ఉన్నాయి, వాటిని పాఠశాలే సమకూర్చుతుందా, బయట నుంచి మనమే ఏర్పాటు చేసుకోవాలా? అనే అంశాలపై ఆరా తీయాలి.

Job Mela: జూన్‌ 1న డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్‌ మేళా..

● ఒక్కో తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులను కూర్చోబెడతారు? విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలు ఉన్నాయా లేదా? అన్ని సబ్జెక్ట్‌లకు ఉపాధ్యాయులు ఉన్నారా అన్న విషయాన్ని తెలుసుకోవాలి.

● జీ+1 భవనమైతే అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నారా? అందుకు అవసరమైన యంత్ర పరికరాలు, సామగ్రిని సిద్ధంగా ఉంచారో లేదో ఆరా తీయాలి.

● ముందస్తు అడ్మిషన్లతో జాగ్రత్త

● పాఠశాలల గురించి తెలుసుకున్నాకే పిల్లలను చేర్పించాలి

● ప్రభుత్వ గుర్తింపు, రిజిస్ట్రేషన్‌ ఉంటేనే ముందుకెళ్లడం మంచిది

Inter Admissions: ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ గుర్తింపు లేకుండానే తరగతులు

కోనసీమ జిల్లాలో దాదాపు 200కి పైగా ప్రైవేటు విద్యా సంస్థలున్నాయి. అయితే, పలు విద్యా సంస్థలు తమ బోర్డులపై రిజిస్ట్రేషన్‌ పొందిన సంస్థ అని రాస్తున్నారు గాని వాటిలో కొన్ని ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకుండానే నడుస్తున్నాయి. కొన్ని పాఠశాలలు సీబీఎస్‌ఈ అనుమతులు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి. మొదట ప్రారంభానికి అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్‌ అనుమతి తీసుకోవాలి.

KG to PG Admissions: ‘వసతి’ లేక నిరాశ

సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. కానీ, కొన్ని విద్యాసంస్థలు మసిపూసి మారేడు కాయ చేస్తూ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నడుస్తున్న అలాంటి పాఠశాలలు ఏడాది చివరలో ఇతర విద్యాసంస్థల పేరున విద్యార్థులతో పరీక్షలు రాయించి మమ అనిపించేస్తున్నాయి. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే తప్ప రెగ్యులర్‌ విద్యార్థిగా పరిగణించదు. అలాగే మరికొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బ్రాంచీల పేరుతో వేరే చోట పాఠశాలలు, కళాశాలలను నిర్వహిస్తూ ఎక్కడో ఉన్న మెయిన్‌ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తున్నాయి.

AP ECET & ICET Results 2024: రేపు ఉదయం 11 గంటలకు ఈసెట్‌, ఐసెట్‌ ఫలితాలు విడుదల

ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి తమ పిల్లలను చేర్పించే విద్యా సంస్థ అనుమతి పత్రాలను ముందుగానే నిశితంగా పరిశీలించుకోవాలి. అక్కడ ఉండే మౌలిక సౌకర్యాలేంటో ఆరా తీయాలి. ప్రభుత్వ గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముందే అంచనా వేసి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన ప్రైవేటు విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారుల చర్యలు అంతంత మాత్రమే కావడంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. అందుకే తల్లిదండ్రుల నిశిత పరిశీలన, వివేకంతో తీసుకునే నిర్ణయం వారి పిల్లల చదువుల అభ్యున్నతికి చక్కని పునాది పడేలా చేస్తుంది.

Sudhakar Reddy: ‘స్కాలర్‌ జీపీఎస్‌’ ఉత్తమ పరిశోధకుడుగా సుధాకర్‌రెడ్డి

 గుర్తింపు పాఠశాలల జాబితా విడుదల చేస్తాం

ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. విద్యార్థులకు పాఠశాలల్లో క్రీడా మైదానంతో పాటు అన్ని వసతులు పక్కాగా ఉండాలి. లేకుంటే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం. అదే విధంగా విద్యా సంస్థ పక్కాగా రిజిస్ట్రేషన్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు తప్పక పొంది ఉండాలి. ప్రైవేటు సంస్థల ఆకట్టుకునే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా గుర్తింపు పొందిన పాఠశాలల వివరాలు తెలియజేస్తాం.

–పిల్లి రమేష్‌, డీఈఓ, కాకినాడ జిల్లా

IERP Survey: ఐఈఆర్పీ ‘డోర్‌ టు డోర్‌’ సర్వేతో పిల్ల‌ల‌కు ప్ర‌త్యేక‌ శిక్ష‌ణ‌..

#Tags