Sudhakar Reddy: ‘స్కాలర్ జీపీఎస్’ ఉత్తమ పరిశోధకుడుగా సుధాకర్‌రెడ్డి
వైవీయూ : కడపలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి కాలిఫోర్నియాకు చెందిన ‘స్కాలర్ జీపీఎస్’ సంస్థ అధ్యయనంలో ఉత్తమ పరిశోధకుడికిగా అవకాశం దక్కించుకున్నాడు.
సంస్థ చేపట్టిన అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా భౌతికశాస్త్ర విభాగంలో 9,75,791 మంది పరిశోధకుల్లో ఈయనకు 1,23,025వ స్థానం, టాప్ 12.61 శాతంలో చోటు దక్కింది. అదే విధంగా ఫాస్ఫోర్స్ సంస్థ పరిశోధనలో 33149 మంది పరిశోధకుల్లో 2271వ స్థానం టాప్ 6.85 శాతం మందిలో చోటు దక్కింది.
కాగా.. డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి లూమినెసెంట్ మెటీరియల్స్‌పై పరిశోధన చేస్తున్నారు. ఎస్‌సీఐ పరిశోధన పత్రాలు, స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ హెచ్–ఇండెక్స్, ఐ10 ఇండెక్స్, గూగుల్ స్కాలర్ హెచ్–ఆర్కిడ్, డేటాబేస్ ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించినట్లు ఆయన తెలిపారు.
Central Electricity Regulatory Commission: సీఈఆర్ఎఫ్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రమేష్ బాబు