Practice Test: విద్యార్థుల‌కు ప్రాక్టీస్ టెస్ట్‌లు

విద్యాశాఖ ఆదేశం మెర‌కు రాష్ట్రంలో విద్యార్థుల‌కు ప్రాక్టీస్ టెస్టులు నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగానే ప్ర‌తీ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఆరు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశాన్ని ప్ర‌క‌టించారు.ఇప్ప‌టికే, ఈ ప్రాక్టీస్ టెస్టుల పేప‌ర్ల‌ను పాఠ‌శాల‌ల్లోకి పంపిణీ చేశారు.
Question papers of practice test for school students

సాక్షి ఎడ్యుకేష‌న్: పాఠశాల విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల అంచనాకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి దేశవ్యాప్తంగా నవంబర్‌ 3న స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంటు సర్వే నిర్వహించనుంది. ఈ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు నిర్ణయిస్తుంది.

Zonal Level Competitions: సీఓఈ క‌ళాశాల‌లో క్రీడా పోటీలు

ఇందులో భాగంగా రాష్ట్రంలోని విద్యార్థులకు ఆరు ప్రాక్టీస్‌ టెస్ట్‌లు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తూ విద్యాప్రమాణాల నిర్దారణకు ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్య పాఠశాలలు, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో చదువుతున్న 3, 6, 9 తరగతుల వారికి పరీక్ష నిర్వహించనున్నారు. ఒక్కో తరగతికి ఆరు పరీక్షలు నిర్వహిస్తారు.

Employees Strike: ఉద్యోగుల స‌మ్మేకు తాత్కాలిక విర‌మ‌ణ‌

సెప్టెంబర్‌ 23, అక్టోబర్‌ 3, 27, 31, నవంబర్‌ 2న నిర్వహించే పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. బదిలీల షెడ్యూల్‌ సాకుగా చూపి పరీక్షలు నిర్వహించని పక్షంలో తీవ్ర చర్యలుంటాయని విద్యాశాఖ డైరెక్టర్‌ హెచ్చరించారు. ఇప్పటికే పరీక్ష పేపర్లను జిల్లాలకు పంపించగా.. శుక్రవారం డీసీఈబీ సెక్రెటరీ భీంరావు పాఠశాలలకు పంపిణీ చేశారు.

#Tags