CBSE Syllabus: చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భ‌విష్య‌త్తు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు..

నంద్యాల: గత విద్యాసంవత్సరంలో సీబీఎస్‌ఈ సిలబస్‌లో 8, 9 తరగతులు చదివిన విద్యార్థులు 2024–25 విద్యాసంవత్సరంలో 9, 10 తరగతులకు వెళ్లనున్నారు. అలాగే, 7వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 8వ తరగతిలోకి ప్రవేశించనున్నారు.

Silent Layoffs: సైలెంట్‌ లేఆఫ్స్.. 20000 మంది టెకీ ఉద్యోగాలు ఇంటికి..!

ఈ ఏడాది 10వ తరగతి తొలి బ్యాచ్‌ విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌కు సిద్ధం కానున్నారు. నంద్యాల జిల్లాలో తొలి విడతలో 69 పాఠశాలలు ఎంపిక చేశారు. బట్టీ విధానానికి, మూస పద్ధతికి స్వస్తి పలికి సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేయనున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవలే 754 మంది ఉపాధ్యాయులకు ఇంగ్లిషు, మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులలో శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు త్వరలోనే పాఠ్య పుస్తకాలు అందజేయనున్నారు.

TS Teachers Promotions and Transfers Update News 2024 : టీచర్ల బదిలీలు, పదోన్నతులకు లైన్ క్లియ‌ర్‌.. జూన్ రెండో వారంలోనే..!

విద్యార్థులకు భారం లేకుండా..

ఇప్పటి వరకు కార్పొరేట్‌, ఇతర ప్రత్యేక పాఠశాలల్లోనే సీబీఎస్‌ఈ సిలబస్‌ విధానం అమలవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న పోటీ ప్రపంచంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలంటే సీబీఎస్‌ఈ సిలబస్‌ కచ్చితంగా ఉండాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇలాంటి బోధన అందించాలన్న సంకల్పంతో చర్యలు తీసుకుంది. ఈ సిలబస్‌ ఉన్న పాఠశాలల్లో బోధన అత్యాధునికంగా ఉంటుంది. జేఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేయాలంటే సంబంధిత విద్యా సంస్థ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌లో అఫ్లియేషన్‌ పొందాల్సి ఉంటుంది. అిఫ్లియేషన్‌, రిజిస్ట్రేషన్‌, పరీక్ష ఫీజుల కోసం ఒక్కొక్క పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.లక్ష రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 69 పాఠశాలలకు రూ.69 లక్షలు ప్రభుత్వమే గత విద్యా సంవత్సరంలో చెల్లించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు చదువుతుండటంతో విద్యార్థులపై భారం పడకుండా ప్రభుత్వమే ఆర్థిక భారాన్ని భరించింది.

AP ECET 2024 Rankers: ఏపీ ఈసెట్‌–2024 ప‌రీక్ష‌లో ఉత్త‌మ ర్యాంకులు సాధించి ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థులు..

ఉజ్వల భవిష్యత్తు

చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిత సొంతమవుతుందని, వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయన్న ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. అందులో భాగంగా ప్రభుత్వ బడుల్లో సంస్కరణలు చేపట్టింది. నాడు– నేడు కింద పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించింది. డిజిటల్‌ విద్యను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధించే సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రభుత్వ బడుల్లో బోధించేందుకు చర్యలు చేపట్టింది.

విద్యార్థికి స్నేహ పూర్వకంగా ఉంటుంది. కోర్సు నిర్మాణం ఒత్తిడికి గురిచేయదు. పుస్తకాలు ఆసక్తిగా, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో రూపొందిస్తారు.

Hotel Management Courses: హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. అర్హులు వీరే..!

పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించేందుకు దోహదపడతాయి. యాంత్రిక విద్యకు దూరంగా ఉంటాయి. వాస్తవాలకు దగ్గరగా విద్యను బోధిస్తారు. పరీక్షల్లో ఉత్తీర్ణత శాతానికి పెద్దగా ప్రాధాన్యం కల్పించరు. ఏ మేరకు సబ్జెక్టు నేర్చుకున్నారన్నది పరీక్షించేలా ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. ఫలితాలు అనుకూలంగా వస్తాయి.

ఐఐటీ, ఎయిమ్స్‌ వంటి కేంద్రీకృత సంస్థ నుంచి భవిష్యత్‌ అధ్యయనాలు కొనసాగించాలనుకుంటే సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలు చాలా సహాయపడతాయి. ఈ సంస్థల ప్రాథమిక పరీక్షలు సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహిస్తారు.

Indian Grand Prix-2 Athletics Meet: ఇండియన్‌ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్‌ మీట్‌లో శ్రీనివాస్‌కు స్వర్ణం.. శిరీషకు కాంస్యం

#Tags