Students to Schools: పిల్లలను బడిలోకి చేర్పించేందుకు సరికొత్త కార్యక్రమం.. 'డోర్ టు డోర్'తో ప్రత్యేక డ్రైవ్..
అనంతపురం: బడిఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం ‘నేను బడికి పోతా’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 6–14 ఏళ్ల పిల్లలందరూ బడుల్లోనే ఉండాలి. డ్రాపౌట్ పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. సమగ్ర శిక్ష ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సమగ్రశిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సహకారంతో ‘డోర్ టు డోర్’ తిరుగుతూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.
Mission Life Program: పాఠశాలల్లో మిషన్ లైఫ్ కార్యక్రమం.. విద్యార్థులచే ప్రతిజ్ఞ ఇలా..!
చదువుకుంటే కలిగే లాభాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలపై పిల్లలతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలలకు పంపేలా చర్యలు తీసుకోకున్నారు. జూలై 13 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది. ఇందులో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికారులతో ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. ఆయా కమిటీల సభ్యులు వారికి అప్పగించిన పనులను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూలై 12న వలటీర్లు తమకు కేటాయించిన ఇళ్లల్లోని పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉన్నారని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. అలాగే అదేరోజు పేరెంట్స్ కమిటీలు కూడా తమ పాఠశాలల పరిధిలోని పిల్లలందరూ బడుల్లో ఉన్నట్లు ప్రకటించనున్నారు.
జిల్లా కమిటీలో ఎవరెవరు ఉంటారంటే..
డీఈఓ, సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ చైర్మన్‌గా, ఏపీసీ మెంబర్ కన్వీనర్‌గా, లేబర్ శాఖ డీసీ/ఏసీ, ఐటీడీఏ పీఓ, ఐసీడీఎస్ పీఓ, ట్రైబల్, సోషల్, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ డీడీలు, ఎన్‌సీఎల్‌పీ డీడీ, మెప్మా పీడీ, డీవైఈఓ, ఉర్దూ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు.
మండల కమిటీల్లో..
మండల విద్యాశాఖ అధికారి మెంబర్ కన్వీనరుగా వ్యవహరిస్తారు. ఎంపీడీఓ చైర్మన్‌గా, తహసీల్దార్, ఐసీడీఎస్ సీడీపీఓ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల నుంచి సంబంధిత అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం, ఉర్దూ స్కూల్ హెచ్‌ఎం, కేజీబీవీ ఎస్‌ఓ, డీఎల్‌ఎంటీ సభ్యులు ఉంటారు.
గ్రామ కమిటీల్లో..
పేరెంట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి గ్రామ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పాఠశాల హెచ్‌ఎం మెంబర్ కన్వీనర్‌గా, పంచాయతీ కార్యదర్శి, సీఆర్పీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ వలంటీరు, అంగన్‌వాడీ ఉద్యోగి సభ్యులుగా ఉంటారు.
Pema Khandu: అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ ప్రమాణం.. వరసగా మూడోసారి