Mission Life Program: పాఠశాలల్లో మిషన్ లైఫ్ కార్యక్రమం.. విద్యార్థులచే ప్రతిజ్ఞ ఇలా..!
రాప్తాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ లైఫ్ కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని ఉపాధ్యాయులను సమగ్ర శిక్ష ఏపీసీ నిదియాదేవి ఆదేశించారు. రాప్తాడులోని జెడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. తడి, పొడి చెత్త వేరు చేసి ఎరువుగా మార్చే విధానాలపై ఆరా తీశారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగించబోమని, మొక్కల పెంపకాన్ని విరివిగా చేపడుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
World Blood Donor Day: నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
మిషన్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఈ–వేస్ట్ సేకరణపై కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. మిషన్ లైఫ్ రోజు వారి కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని, ఇందులో ఎవరికీ మినహయింపు ఉండదని స్పష్టం చేశారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎకో క్లబ్‌ల సహకారంతో కార్యక్రమాలు చేపట్టేలా చూడాలని ఎంఈఓ మల్లికార్జునను ఆదేశించారు. అనంతరం స్టూడెంట్ కిట్స్ మండల స్టాక్ పాయింట్‌ను సందర్శించారు. విద్యార్థి కిట్లకు సంబంధించి ఏ వస్తువులు వచ్చాయి. ఏఏ పాఠశాలలకు ఎంత మేర పంపిణీ చేశారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
TS ICET 2024 Results Declared: ఐసెట్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి.. టాప్-10 ర్యాంకర్లు వీళ్లే..
పాఠ్య, నోట్ పుస్తకాలను వెంటనే విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలివ్వాలని ఎంఈఓ మల్లికార్జునకు సూచించారు. బ్యాగులు, బెల్టులు, షూలు తదుపరి తేదీలు ప్రకటించిన తర్వాత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు మల్లికార్జున, కుళ్లాయప్ప, సీఎంఓ గోపాల్, చంద్రశేఖరరెడ్డి, హెచ్‌ఎం నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Tags
- Mission Life Program
- Schools
- Students
- Samagra Shiksha
- APC Nidiya Devi
- pledge with students
- e waste
- awareness program for teachers
- plantation in schools
- environment protection
- school teachers
- Education News
- Sakshi Education News
- ananthapur district news
- Comprehensive Punishment
- Central government initiatives
- State government initiatives
- Comprehensive Punishment
- SakshiEducationUpdates