IB Education in AP Schools: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో... IB(ఇంటర్నేషనల్ బకలారియేట్) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ SCERT మధ్య ఒప్పందం!!

నేడు (Jan 31 2024) సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా ... గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే విధంగా... పంచంలోనే అత్యుత్తమ బోధనా పద్ధతి IB (ఇంటర్నేషనల్ బకలారియేట్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ SCERT (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)ల మధ్య ఒప్పందం.

IB వలన ఇవే లాభాలు!

  • IB విధానంలో  విద్యనభ్యసించిన వారికి ఇతరులతో  పోలిస్తే... ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ప్రవేశం దొరకడం మూడు రెట్లు అధికం. 
  • IB విధానంలో  విద్యనభ్యసించిన వారికి ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలు

ఎప్పటి నుంచంటే

  • జూన్, 2025 నుండి 1వ తరగతికి IBలో  విద్యాబోధన
  • జూన్ 2026 నుండి రెండో తరగతికి IBలో  విద్యాబోధన

ఇలా క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుకుంటూ పోతూ... 2035 నాటికి 10వ తరగతికి, 2037 నాటికి 12వ తరగతికి IB- రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్..

దీనిలో భాగంగా ఇప్పటికే మన విద్యార్థులను IB విధానానికి సన్నద్ధులను చేస్తూ.. గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే ప్రక్రియకు 2019 నుండే శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. 

చదవండి: India Today Education Summit 2024: తిరుపతి ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న‌ సీఎం జగన్

దీనిలో భాగంగా ఇప్పటికే... 

  1. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంలో  విద్యాబోధన - సీబీఎస్ఈ మొదలు  IB దాకా ప్రయాణం.. మూడో తరగతి నుండి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్
  2. విద్యార్థులకు సులభంగా ఇంగ్లీష్ పాఠాలు అర్థమయ్యేలా... 9 వస్తువులతో  కూడిన జగనన్న విద్యాకానుక కిట్ లో భాగంగా బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ.  
  3. 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచిత బైజూస్ కంటెంట్.
  4. 8వ తరగతి విద్యార్థులకు, బోధించే  టీచర్లకు బైజూస్ ప్రీ లోడెడ్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్ లు. 
  5. నాడు-నేడు ద్వారా IBకి అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన. 
  6. ఆధునిక డిజిటల్ విద్యాబోధనకు ఊతమిస్తూ... 6వ తరగతి ఆపైన ప్రతి తరగతిలోనూ  డిజిటల్ బోధన... ఇందుకోసం 6వ తరగతి ఆపైన ప్రతి తరగతి గదిలో ఉండేలా 62 వేల ఐఎఫ్ పీలు.. 
  7. ఇంగ్లీష్ ల్యాబ్ లకు ఊతమిస్తూ... 1 నుండి 5వ తరగతి వరకు ప్రతి స్కూల్ లో 45,000 స్మార్ట్ టీవీలు. 
  8. TOEFL: ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ లో  నైపుణ్యం సాధించేలా 2024 నుండే ప్రతి స్కూల్లో 3వ తరగతి నుండి TOEFL ను ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టి, ట్రైనింగ్  ఇస్తూ, TOEFL జూనియర్, ఇంటర్ లో  TOEFL సీనియర్ పరీక్షలు కూడా నిర్వహించి అమెరికన్ సర్టిఫికెట్ అందజేత... ఈ మేరకు ఈటీఎస్ తో  ఒప్పందం.
  9. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఉన్నతికి ఊతం
  10. ఈ 56 నెలల్లో రూ.73,417 కోట్ల వ్యయంతో విద్యారంగంలో సంస్కరణలు
  11. నేడు IBతో  ఒప్పందం... 2024-25 విద్యా సంవత్సరంలో 'IB' పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యం పెంచేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, SCERT, DIET సిబ్బంది, SSC, ఇంటర్మీడియట్ బోర్డుల సిబ్బందికి శిక్షణ అందించి IB సర్టిఫికెట్లు అందజేత. ఈ విధంగా IB శిక్షణ పొందిన టీచర్లు ప్రతిష్టాత్మక "IB గ్లోబల్ టీచర్ నెట్ వర్క్" లో  భాగం.

చదవండి: Nadu Nedu Scheme: ‘మా బడి – మంచి గుడి’ నాడు-నేడు అమ‌లుపై అభిప్రాయాలు ఇవే..

#Tags