School Holiday Cancel : ఆరోజు స్కూళ్లకు సెలవు క్యాన్సెల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఇటీవలె, రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరుసగా విద్యార్థులకు సెలవులు లభించాయి. దీంతో మొదట్లో సరదా పడినా, వరుసగా రావడంతో విద్యార్థుల చదువుపై దెబ్బ పడుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి తొడు రానున్న రోజుల్లో విద్యార్థులకు మరోసారి వరుస సెలవులు రానున్నాయి. దీంతో, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో వరుసగా నాలుగు రోజులు విద్యార్థులకు సెలవులు ఉండగా అందులో ఒక సెలవుని రద్దు చేస్తోంది ప్రభుత్వం.
Guest Faculty Posts : ఎస్‌ఎస్‌సీటీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..
ఈ తేదీన సెలవు రద్దు..
సెప్టెంబర్‌లో 14వ తేదీ రెండో శనివారం కాగా, ఆ రోజు సెలవు ఉంటుంది. తదుపరి రోజు ఆదివారం, ఇలా రెండు వరుస సెలవులు వచ్చాయి. మరుసటి రోజు సెప్టెంబర్ 16.. ఈ తేదీన మిలాద్ ఉన్ నబీ కాబట్టి.. ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. మరొకటి వినాయక నిమర్జనం దీనికి కూడా విద్యాసంస్థలకు సెలవు ఉండడంతో పూర్తిగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే, ఇందులో ఒక సెలవును రద్దు చేస్తోంది ప్రభుత్వం. అదే, 16వ తేదీన జరిపే మిలాద్ ఉన్ నబీ. ఈ పండగ తేదీ మారింది.. నెలవంక దర్శనాన్ని బట్టి ఈ పండగను 16వ తేదీ కాకుండా 17వ తేదీన జరుపుకుంటున్నారు. దీంతో సర్కార్ 16వ తేదీ సెలవును రద్దు చేసింది.
ట్రిప్స్ ప్లానింగ్..
వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తాయన్న ఆశతో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ టూర్‌లకు ప్లాన్ చేస్తున్నారు. కాని, ఈ సెలవు రద్దు విషయం తెలిసాక కొందరు క్యాన్సెల్ చేసుకోవడం, లేదా కొందరు ఒక్క రోజే కదా పర్లేదులే అనుకుంటున్నారు.
Good News For Government Employees : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వీరికి దసరా కానుకగా...