Students Free Bus Pass news: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..ఇకపై ఉచిత బస్‌పాస్‌

Free Bus Pass news

విజయనగరం అర్బన్‌: జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో విద్యాలయాలకు రాకపోకలు సాగించే విద్యార్థులకు ప్రజా రవాణాశాఖ ఏటా ఉచిత, రాయితీ బస్‌పాస్‌లు జారీ చేస్తోంది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభమయ్యాయి. ఆర్టీసీ బస్‌పాస్‌ల జారీని ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం పాస్‌లకోసం వచ్చే విద్యార్థులతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ సందడిగా మారింది.

Gurukula School Jobs: గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు

రాయితీ, ఉచిత పాసుల జారీ ఇలా..

అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు 12 ఏళ్లలోపు బాలురు, 18 ఏళ్లలోపు బాలికలకు ఉచితంగా బస్సు పాస్‌లను ఆర్టీసీ అధికారులు జారీ చేస్తున్నారు. ఇది ఏడాది పొడుగునా చెల్లుబాటు అవుతుంది. ఈ పాస్‌లతో విద్యార్థులు తమ నివాసం నుంచి 20 కిలోమీటర్ల వరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనికోసం విద్యార్థి ఫొటో, స్కూల్‌ యాజమాన్యం నుంచి బోనిఫైడ్‌ సర్టిఫికెట్‌, ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. మిగిలిన వారికి రాయితీపై పాస్‌లను మంజూరు చేస్తారు.

పాస్‌ ధరతోపాటు సంవత్సరం గుర్తింపుకార్డు కోసం రూ.100, నెలవారీ గుర్తింపు కార్డు కోసం రూ.50, సర్వీస్‌ చార్జి కింద రూ.40 అదనంగా చెలిచాల్సి ఉంటుంది. రాయితీ బస్‌పాస్‌లు నెల, మూడు నెలలు, ఏడాది కాలపరిమితిపై జారీ చేస్తారు. గడువు ముగిశాక రెన్యువల్‌ కోసం ప్రిన్సిపాల్‌ సంతకం చేయించుకుని తిరిగి పొందాల్సి ఉంటుంది. సాధారణ విద్యార్థులకు జూన్‌ నుంచి ఏప్రిల్‌ వరకు, ఐటీఐ, పారామెడికల్‌ చదివే వారికి మే నెలలో కూడా పాస్‌లను మంజూరు చేస్తారు.

ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక స్టేజీగా పరిగణలోకి తీసుకుని దూరాన్ని బట్టి రాయితీ ఇస్తారు. జిల్లా విజయనగరం, ఎస్‌.కోట డిపోల పరిధిలో గత ఏడాది ఉచిత, రాయితీ, దివ్యాంగ పాస్‌లను 1,103 మంది సద్వినియోగం చేసుకున్నారు.

పాస్‌ల కోసం దరఖాస్తు ఇలా..

జిల్లా ప్రజా రవాణా శాఖ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్‌ కార్డుల జెరాక్స్‌ కాపీలతో పాటు స్టడీ సర్టిఫికెట్‌, రెండు పాస్‌ఫొటోలు జతచేయాలి. దరఖాస్తులను సమీపంలోని ఆర్టీసీ డిపో మేనేజర్‌ పరిశీలించి పాస్‌ మంజూరుకు సిఫార్సు చేస్తారు. వీటిని నిర్ణీత రుసుం చెల్లించి కౌంటర్‌ వద్ద బస్సుపాస్‌ను పొందవచ్చు. గతేడాది మంజూరు చేసిన బస్సు పాస్‌ల రెన్యూవల్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

Anganwadi news: అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు బ్యాడ్‌న్యూస్‌...

జిల్లాలో ఏడు బడి బస్సులు

జిల్లాలోని ప్రధాన పట్టణాల సమీప గ్రామాలకు బడిబస్సు పేరుతో విద్యార్థులకు రవాణా సేవలను ఆర్టీసీ సంస్థ అందిస్తోంది. పాఠశాలలు, కళాశాలల సమయాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను నడుపుతోంది.

విజయనగరం డిపో పరిధిలో ఏర్పాటు చేసిన మూడు బడి బస్సు సర్వీసులు గంట్యాడ మండలం తాడిపూడి, నెల్లిమర్ల మండలం బొప్పడాం, పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామాల వరకు రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో రాకపోకల సేవలు అందజేస్తాయి. అలాగే, ఎస్‌.కోట డిపో పరిధిలో నాలుగు బడిబస్సులను ఆర్టీసీ ఏర్పాటుచేసింది.

పాస్‌లు మంజూరు చేస్తున్నాం

జిల్లాలోని రెండు డిపోల్లో బస్సు పాస్‌లను మంజూరు చేస్తున్నాం. గతేడాది 2,083 మంది విద్యార్థులకు ఉచిత పాస్‌లు, 20,588 మందికి రాయితీ పాస్‌లు, దివ్యాంగులకు 1,103 పాస్‌లు మంజూరు చేశాం. వీటిని రెన్యువల్స్‌ చేస్తున్నాం. 50 కిలోమీటర్ల పరిధి వరకు ఇస్తున్న రాయితీ పాస్‌ల మంజూరుకు ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించాం.

రెన్యువల్‌ కొనసాగింపు

12 ఏళ్లలోపు బాలురు, 18 ఏళ్లలోపు బాలికలకు ఉచితం

ఎప్పటివలే ఈ ఏడాది కూడా

కొత్తగా దరఖాస్తుల స్వీకరణ

గత ఏడాది 23,774 మంది విద్యార్థులకు పాస్‌ల సౌకర్యం

దివ్యాంగుల అర్హతలు, మంజూరూ ఇలా..

దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత, రాయితీ పాస్‌లు మంజూరు చేస్తుంది. వీరు సదరన్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, అన్‌ ఎంప్లాయిమెంట్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. మూడేళ్ల కాల వ్యవధితో పాస్‌లను జారీ చేస్తారు. ఐడీ కార్డు కోసం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

రాయితీ పాస్‌ల మంజూరు ఇలా...

చదువుకునే ప్రతి విద్యార్థి రాయితీ బస్సు పాస్‌ పొందవచ్చు. చార్జీలో ఒక వంతు మాత్రమే విద్యార్థి చెల్లించేలా పాస్‌లను జారీ చేస్తారు. విద్యార్థి నివాసం నుంచి 50 కిలోమీటర్ల వరకు రాయితీ పాస్‌కు అర్హత ఉంటుంది. కళాశాల నుంచి బోనిఫైడ్‌ సర్టిఫికేట్‌ సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థి ఫొటో జతచేసి నెలవారీ, మూడు నెలలకు, సంవత్సరం పాస్‌లను పొందవచ్చు. నెలవారీ ఐడీ కార్డులకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

#Tags