Inspection : కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ..
శెట్టూరు: స్థానిక కేజీబీవీని జీసీడీఓ వాణీదేవి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని సిబ్బంది, విద్యార్థుల హాజరుపట్టీని పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, నిల్వ, మిగులు, ఆహారంలో నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులు ఆరోగ్య వివరాలు, హెల్త్ చెకాప్ అంశాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ... బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై చైతన్య పరిచారు. చదువుకుంటే జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా జీవించవచ్చునన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రినిపాల్ లలిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Lecturer Jobs: గెస్ట్ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ.. అర్హతలు ఇవే..
#Tags