Skip to main content

CBSE Board Exam 2025: సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. రిజిస్ట్రేషన్‌కు ఇదే చివరి తేది

CBSE Board Exam 2025  CBSE Board Exams registration announcement CBSE Pariksha Sangam portal registration CBSE Board Exams start date Central Board of Secondary Education registration process
CBSE Board Exam 2025

సీబీఎస్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. 9, 11వ తరగతి విద్యార్థులు ఈరోజు(సెప్టెంబర్‌ 18) నుంచి పరీక్షా సంగం పోర్టల్‌ parikshasangam.cbseలో  దరఖాస్తు చేసుకోవచ్చు.

Job Mela: గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా, నెలకు రూ. 25వేల వేతనం

ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే బోర్డ్‌ ఎగ్జామ్స్‌కి అనుమతించమని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.  అక్టోబర్‌ 16లోగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఆలస్య రుసుముతో అక్టోబర్‌ 18 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్‌ గడువు అక్టోబర్‌ 24న ముగుస్తుంది. 

Overseas Vidya Nidhi scholarship: విదేశీ విద్యకు రూ. 20 లక్షల ఉపకారవేతనం.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

CBSE బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. ఇలా రిజిస్ట్రేషన్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ cbse.gov.inను క్లిక్‌ చేయండి. 
  • హోంపేజీలో కనిపిస్తున్న Class 9 and 11 Board Exams Registration 2025 అనే లింక్‌ను క్లిక్‌ చేయండి
  • మీ పేరు, పుట్టినరోజు వివరాలు, స్కూల్‌ కోడ్‌ వంటి వివరాలను నమోదు చేయండి
  • అవసరమైన డాక్యుమెంట్స్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో, సిగ్నేచర్‌, స్కూల్‌ ఐడీ ప్రూఫ్‌ వంటి వివరాలను అప్‌లోడ్‌ చేయండి
  • తర్వాత పేజీలో పేమెంట్‌ ఆప్షన్‌ చూపిస్తుంది.. డెబిట్‌/క్రిడిట్‌/యూపీఐతో పేమెంట్‌ చేయండి
  • వివరాలను సబ్‌మిట్‌ చేసేముందు మరోసారి క్రాస్‌చెక్‌ చేసుకొని సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి
Published date : 18 Sep 2024 03:28PM

Photo Stories