Free Admissions: ప్రైవేటు విద్యాసంస్థ‌ల్లో పేద విద్యార్థుల‌కు ఉచిత ప్ర‌వేశాలు!

చదువుకు పేద, పెద్ద అంతరాల్లేవ్‌.. అడ్డుగోడలు అంతకన్నా ఉండకూడదు.. పేదరికాన్ని పారద్రోలే పెద్ద ఆయుధం విద్య..

ఆళ్లగడ్డ: అక్షర జ్ఞానంతోనే పేదల ఆర్థిక పర్థిస్థితిని మెరుగుపరచవచ్చు అన్న సంకల్పంతో విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు పైసా ఖర్చు లేని ఉచిత విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పేద పిల్లలకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే మొదటి విడతగా జిల్లాలో 960 మంది విద్యార్థులను ఎంపిక చేయగా వారు ఈ నెల 20 తేదీ లోపు అడ్మిషన్లు పొందాలని గడువు విధించింది.

Awareness Classes for Teachers : నేడు ఈ స‌బ్జెక్టు టీచ‌ర్ల‌కు అవ‌గాహ‌న త‌ర‌గ‌తులు..

నియోజకవర్గం ప్రైవేటు పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులు

ఆళ్లగడ్డ 26

బనగానపల్లె 78

డోన్‌ 270

నంద్యాల 273

నందికొట్కూరు 206

పాణ్యం 28

శ్రీశైలం 79

మొత్తం 960

Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి రిటైర్మెంట్!!

జిల్లాలో 960 మందికి ప్రవేశాలు

ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుతో 2024 – 25 విద్యాసంత్సరానికి పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా 247 ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలతో ఆన్‌లైన్‌ పోర్టర్‌లో నమోదు చేసుకున్నాయి. వీటిలో సుమారు 3 వేల సీట్లు అందుబాటులో ఉండగా మొదటి విడతలో 1,867 మంది పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 960 మంది విద్యార్థులను జిల్లా అడ్మిషన్‌ మానిటరింగ్‌ కమిటీ ఎంపిక చేసి జాబితాను విద్యాశాఖ మండల అధికారులకు పంపింది. వీరిలోనూ ఇప్పటికే 600 మంది ప్రవేశం పొందారు. మిగతా వారు ఈ నెల 20వ తేదీలోపు కేటాయించిన పాఠశాలల్లో ప్రవేశం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

AP SSC Supplementary Exams: ఈనెల 24 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

సీట్ల కేటాయింపు ఇలా..

ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ సూళ్లన్నింటిలోను 2024 – 25 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో తప్పనిసరిగా 25 సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. అనాథలు, దివ్యాంగులు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, ఇతర వర్గాలకు 6 శాతం సీట్లు కేటాయించాలి.

అనుమానాల నివృత్తికి 14417 టోల్‌ ఫ్రీ నంబర్‌

ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తు, సీట్లు పొందే అంశాలపై ఏమైనా ఇబ్బందులు, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం 14417 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. వచ్చిన గ్రీవెన్స్‌లను సత్వర పరిష్కారం కోసం ఎంఈఓ, డీఈఓ స్థాయిలో ప్రత్యేకంగా సెల్‌ ఏర్పాటు చేశారు.

E Content Generation:అధ్యాప‌కుల‌కు ఈ కంటెంట్ జ‌న‌రేష‌న్‌పై శిక్ష‌ణ‌.. రెండో రోజు ఈ విష‌యాల అవ‌గాహ‌న‌!

ఫీజు చెల్లింపు..

ప్రైవేటు పాఠశాలల్లో సీటు పొందిన విద్యార్థులు ఏడాదికి ఎంత ఫీజు చెల్లించాలనేది ప్రభుత్వం ముందుగానే నిర్ణయించింది. పట్టణాల్లో రూ.8 వేలు, రూరల్‌లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100. వీటిని అమ్మ ఒడి పథకం కింద విద్యార్థులు ప్రవేశం పొందిన పాఠశాలకు ప్రభుత్వం చెల్లించనుంది.

చేరకుంటే సీటు రద్దు

జిల్లాలోని ప్రతి ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయిస్తాం. ఎంపికై న వారిని చేర్చుకోబోమని అడ్మిషన్లు తిరస్కరించినా, ఫీజు చెల్లించాలని వేధించినా కఠిన చర్యలు తప్పవు. ప్రస్తుతం 960 మంది విద్యార్థులకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో సీట్లు కేటాయించారు. ఈ నెల 20వ తేదీ లోపు చేరాలి. లేకపోతే సీటు రద్దు అవుతుంది.

– సుధాకర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి

Training Camp in Library: వేస‌వి సెల‌వుల్లో గ్రంథాల‌యంలో శిక్ష‌ణ శిబిరాలు.. స‌ద్వినియోగం చేసుకోండి..

#Tags