Open school News :ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు గడువు పెంపు
రాయచోటి : ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు ఈ నెల 31వ తేది వరకు గడువు పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్‌రెడ్డి, ఓపెన్ స్కూల్స్ జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనవాసరాజులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రూ.200ల అపరాధ రుసుంతో ఈ నెల 26 నుంచి 29 వరకు, రూ.500ల అపరాధ రుసుంతో ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చుని వివరించారు.
#Tags